-
-
టార్గెట్ నెంబర్ 2
Target Number 2
Author: Manjari
Publisher: Sagar Publications
Pages: 65Language: Telugu
నలుగురు వ్యక్తులులోపలికి ప్రవేశించారు. అంతా మొహాలు గుర్తుపట్టడానికి వీలులేకుండా సాక్సు తలలకి
తొడుక్కున్నారు.అందరి చేతుల్లో స్టెన్‌గన్స్ ఉన్నాయి.
“ఎవరూ కదలకండి... ముందున్నవాడు చెప్పాడు.”
వేలెట్ వెంటనే భయంతో చేతులు పైకెత్తాడు.
“కమాన్... ఆ మూలకి వెళ్ళండి” అరిచాడతను స్టెన్‌గన్ ఆడిస్తూ.
మిగతా ముగ్గురి చేతుల్లో స్టెన్గన్స్తో పాటు ప్లాస్టిక్ తాళ్ళున్నాయి. ముందు వేలెట్ని జార్జ్ రిచర్డ్‌సన్‌ని కట్టేశారు.
తర్వాత లూసీని, పిల్లల్ని కట్టారు.
“ఎవరు మీరు?” భయాన్ని వ్యక్తం కానీకుండా రిచర్డ్సన్ నెమ్మదిగా అడిగాడు.
“షటప్... ప్రశ్నలు అడగాల్సింది మేము...”
బయట ఆయుధాలతో సెక్యూరిటీ ఉండగా వాళ్ళెలా లోపలికి రాగలరు? తనని బంధించారంటే చంపడానికి
రాలేదన్నమాట. వెళ్ళేటప్పుడు చంపుతారా? శత్రుదేశం వాళ్ళా? తన ఇంట్లోని డాక్యుమెంట్స్ వాళ్ళ చేతుల్లో
పడకూడదు. అత్యంత రహస్యమైనవి.
నలుగురూ వాళ్ళముందు నిలబడి గన్స్ గురి పెట్టారు.
“నేను మూడు చెప్పగానే కాల్చండి...” చెప్పాడు ఆ నలుగురి లీడర్.
తలలూపారు మిగతా ముగ్గురూ. “పారిపోతుండగా కాల్చడం కంటే ఇలా కట్టి కాల్చడం వల్ల గుళ్ళు వృథా కావు”
నవ్వాడతను.
“ఎవరు మీరు? ఎందుకు చంపుతున్నారు?” అడిగాడు జార్జ్ రిచర్డ్సన్ ఆందోళనతో.
“నువ్వే ఊహించు...”
మిగతా ముగ్గురూ ఆ మాటలకు వికృతంగా నవ్వారు.
“మీరు పాకిస్థానీయులు కారు. అమెరికన్స్ అయ్యుండాలి.”
“కొంత వరకూ కరెక్టే... మాట్లాడకుండా దేవుడ్ని తలచుకో. వన్...”
“డాడీ మనల్ని నిజంగా చంపుతారా?” అడిగింది ఆఖరమ్మాయి.
ఆయన బదులు చెప్పలేదు. వాళ్ళెవరయినా సరే అక్కడనుండి అంత తేలికగా తప్పించుకోలేరు అనుకున్నాడాయన.
“’టు...”

- ₹108
- ₹140.4
- ₹108
- ₹86.4
- ₹129.6
- ₹108