-
-
టార్గెట్ ...789
Target 789
Author: Vijayarke
Publisher: Manrobo Publications
Pages: 65Language: Telugu
దర్శక దిగ్గజానికి అక్షర నివాళి
దర్సకరత్న దాసరి నారాయణరావు గారు ప్రధానపాత్రగా వరుసగా సినిమాలు వస్తున్న సమయంలో సినిమా కోసం అనుకుని రాసిన నవల ఇది.పర్వతాలు పానకాలు సినిమా జరుగుతున్నప్పుడు దాసరిగారితో ఈ సబ్జెక్టు గురించి చర్చించడం కూడా జరిగింది."అనివార్య సినిమా కారణాల" వల్ల ఈ నవల నవలగానే మిగిలిపోయింది.
ఒకనాటి డిటెక్టివ్ నవలా వైభవం ఇందులో కనిపిస్తుంది.సరదాగా చదివిస్తూనే సీరియస్ గా ఆలోచింపజేస్తుంది.
ప్రతీ సంఘటన ఉత్కంఠభరితంగా ఉంటుంది.ప్రేమ దేశభక్తి త్యాగం హాస్యం ఇలా ఎన్నో భావోద్వేగాలు టార్గెట్ ...789 లో కనిపిస్తాయి..
(బేబీ షామిలీని (అప్పుడు బాలనటి )ఆ సమయంలోనే ఆంధ్రభూమి కోసం ఇంటర్ వ్యూ చేశాను...(చాక్లెట్స్ లంచంగా ఇచ్చి)....
నాకు తెలిసి అప్పట్లో ఇన్ కం టాక్స్ కడుతున్న ఒకే ఒక బాలనటి.)
1992 లో ఆంధ్రభూమిలో ప్రచురించబడిన నవల ఇప్పుడు ద్వితీయ ముద్రణతో మీ ముందుకు వచ్చిది.
యాక్షన్ కామెడీ థ్రిలర్ ఎమోషన్స్ వున్న ఈ సబ్జెక్టు తాలూకు కంటెంట్ ఇప్పటికీ అలానే వుంది.ఉగ్రవాదం,దేశభక్తి,ఎమోషన్స్...ఈ నవలలో ప్లే చేసిన రోల్స్.
ఇప్పటికీ ఈ నవలను సినిమాగా తెరకెక్కించవచ్చు అనిపిస్తుంది.
ఇక కథలోకి వెళ్తే ...
నారాయణ రావు సిబిఐ ఆఫీసర్ ...అతను అరెస్ట్ చేసిన ఉగ్రవాదిని వదిలివేయాలని లేకపోతే హాస్పిటల్ లో పురుడుపోసుకున్న భార్యాబిడ్డలను చంపేస్తామని బెదిరిస్తుంది ఉగ్రవాద సంస్థ.నారాయణ రావు ఉగ్రవాదిని వదిలేందుకు ఒప్పుకోకపోవడంతో హాస్పిటల్ ను పేల్చేస్తారు.ఆ ప్రమాదంలో భార్యాబిడ్డలను కోల్పోతాడు.
కథ ఇరవయ్యేళ్ళ తర్వాత మళ్ళీ పునరావృతం అవుతుంది.ఉగ్రవాదులు దేశంలో విధ్వంసం సృష్టించేందుకు పన్నాగం పండుతారు సిబిఐ చీఫ్ కు ఈ కేసు అప్పగిస్తుంది ప్రభుత్వం.
ఈ కేసులో కీలకమైన అతి ప్రమాదకరమైన ఓ వ్యక్తిని పట్టుకోవాలి.ఆ వ్యక్తి ఒక మహిళ..డ్రగ్ ఎడిక్ట్...ఉగ్రవాదులకు సంబంధించిన రహస్యాలు తెలిసిన వ్యక్తి.
ఆ అమ్మాయిని ట్రాప్ చేయడానికి సెంటిమెంట్ ను ఆయుధంగా ప్రయోగించాడు..ఈ కేసును డీల్ చేస్తోన్న సిబిఐ చీఫ్.ఆమె తండ్రి తనే అని నమ్మించాడు...ఆమెను ఉరికంభం వైపు నడిపించాడు.
అపుడు తెలిసింది..ఆ అమ్మాయి తన కూతురేనని....ఇరవయ్యేళ్ళ క్రితం బాంబ్ బ్లాస్ట్ లో చనిపోలేదని ..
ఇందులో హీరో పాత్ర (సాకేత్) కామెడీగా కొనసాగుతూనే సీరియస్ గా ఉంటుంది.తరచూ అతను తన వెహికల్ తో మాట్లాడే సన్నివేశాలు సెటైరిగ్గా ఉంటాయి.హీరోయిన్ ను కాపాడ్డానికి ప్రయత్నించే సన్నివేశాలు,అక్షరాలను ఆయుధాలుగా చేసి ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా అతను చేసే పోరాటం అతనిలోని హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తుంది.
సెంటిమెంట్ దేశభక్తి యాక్షన్ ఎమోషన్స్ కామెడీ సస్పెన్స్ అన్నీ వున్న ఎంటర్టైనర్ టార్గెట్ 789 .ఆంధ్రభూమిలో ఈ నవల చదివినప్పుడే థ్రిల్ ఫీలయ్యా.
నయనతార లక్ష్మి మంచు లాంటివాళ్లు ఇలాంటి పాత్రలు పోషిస్తే మంచి థ్రిల్లర్ అవుతుంది.అప్పటి డ్రగ్స్ ఉగ్రవాదుల బెడద ఇప్పటికీ కొనసాగుతూ ఉండడం విషాదకరం.
ఎవరైతే తన కూతురు అని నాటకం ఆడి మరణం వైపుకు తీసుకువెళ్లాడో ఆ వ్యక్తి నిజంగా తన కూతురే అని తెలిసినప్పుడు సిబిఐ చీఫ్ ఫీలింగ్స్ సూపర్బ్
ఇరవైఏడేళ్ల క్రితం వచ్చిన ఈ నవలలోని డ్రగ్స్ అంశం ఇప్పటికీ యువతను పక్కదారి పట్టిస్తున్నాయి.ఈ నవల ఇప్పటికీ ఈ తరానికీ యువతరానికి పనికివస్తుంది.దేశభక్తి ఎమోషన్స్ నిజాయితీ ఈ నవలలోని కీలకమైన అంశాలు.సినిమాగా రూపుదిద్దుకోవలిసిన సబ్జెక్టు.ఎంటర్టైన్మెంట్ తో పాటు ఒక చక్కని సందేశం వున్న నవల.
తండ్రీకూతుళ్ల మధ్య సెంటిమెంట్,అంతకు మించిన ఎమోషన్స్, మోపెడ్ హీరోతో మాట్లాడ్డం,
అడుగడుగునా సస్పెన్స్ థ్రిల్లర్ ..రావు రమేష్ నయనతార లాంటి వాళ్ళు తండ్రీకూతుళ్ల కారెక్టర్లు పోషిస్తే ,మంచి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా అవుతుంది.
1992 లో వున్న ఉగ్రవాద సమస్య,డ్రగ్స్ మాఫియా ఇప్పటికీ ఉండడం విచారకరం
పుట్టగానే మరణించింది అనుకున్న కూతురుశత్రువుల చేతికి చిక్కి, యవ్వనంలో తిరిగివస్తే,
డ్రగ్స్ కు అలవాటైన ఆమెవల్ల దేశభద్రతకు ప్రమాదం వాటిల్లితే,
ఆమెను ఉరికంబానికి తగిలించి బాధ్యత సిబిఐ చీఫ్ ది అయితే,
ఆమె తన కూతురు అని తెలియక,తండ్రిలా నాటకమాడి,ఆమె రహస్యాలు తెలుసుకుని చట్టానికి అప్పగించే సమయంలో ...
ఆమె తన కూతురు అని తెలిస్తే ..?
అతను తీసుకున్న నిర్ణయం ఏమిటి?
టార్గెట్ 789 లక్ష్యం ఏమిటి?
ఉత్కంఠతో చదివించే నవల,.
ఈ నవల నేను ఆంధ్రభూమిలో చదివాను.ఆ తరువాత పుస్తకరూపంలో దొరకలేదు.ఇప్పుడు కినిగె వల్ల మళ్ళీ చదువగలుగుతున్నా.క్రైమ్ సస్పెన్స్ ఎమోషన్స్ అన్నీ కలగలిసిన నవల.ఈ నవలలో వున్నా ఉగ్రవాదం,డ్రగ్స్ విషవలయం ఇప్పటికీ అలానే వుంది.
సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగించే నవల.
వెబ్ సిరీస్ కు సరిపడా సస్పెన్స్ వుంది.తండ్రీకూతుళ్ల మధ్య సెంటిమెంట్,దేశభక్తి,వున్నాయి.ముఖ్యంగా వృత్తిలో భాగంగా " తానే తండ్రి " అని నాటకమాడి,ఆమెను ప్రభుత్వానికి అప్పగించి,చివరికి ఉరికొయ్యకు వేలాడబోయే అమ్మాయే తన కూతురు అని తెలిసినప్పుడు,సిబిఐ అధికారిగా,తండ్రిగా పడ్డ సంఘర్షణ సూపర్బ్,ఇప్పటికీ డ్రగ్స్ మాఫియా,అలానే వుంది.
ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయినా డ్రగ్స్ గురించి ఈ నవలలో చర్చించడం కాకతాళీయం అయినా డ్రగ్స్ తీవ్రతను చెప్పకనే చెబుతుంది.డ్రగ్స్ మహమ్మారిపై ప్రతిఒక్కరు పోరాడాలి.1992 లో ఆంధ్రభూమిలో ప్రచురించబడిన నవల అని చదివి ఆశ్చర్యపోయాను.ఇప్పుడు జరుగుతున్నా సంఘటనలతోనే నవల రాసినట్టు వుంది.సిబిఐ చీఫ్ పాత్ర కళ్ళలో నీళ్లు తెప్పించింది.అప్పట్లోనే సినిమా కోసం రాసానని చెప్పారు రచయిత,ఇప్పటికైనా ఇది సినిమాగా తీయదగ్గ సబ్జెక్ట్.
డ్రగ్స్ ఎంత ప్రమాదకరమో ఈ మధ్య విరివిగా వస్తున్నా పత్రికవార్తలను చూస్తే వీటి తీవ్రత అర్థమవుతోంది.ముప్పయేళ్ల క్రితమే రచయిత డ్రగ్స్ నేపథ్యంతో రాసిన టార్గెట్ నవల చాలా బాగుంది.
మూడు దశాబ్దాలకు పూర్వమే మత్తుమందుల ప్రమాదాన్ని డ్రగ్స్ కు సంబంధించిన అంశాన్ని తీసుకుని ఒక థ్రిల్లర్ నవలగా రాయడం గొప్ప విషయం.తన కూతురు అని తెలియక తండ్రిగా నాటకమాడి కూతురిని ఉరి శిక్ష వరకు నడిపించుకువెళ్లి తీరా తన కూతురే అని తెలిసాక సిబిఐ చీఫ్ గా అతను తీసుకున్న నిర్ణయం చాలా కన్విన్సింగ్ గా చెప్పారు రచయిత.