-
-
తరంగిణి
Tarangini
Author: Jeedigunta Ramachandra Murthy
Publisher: Self Published on Kinige
Pages: 136Language: Telugu
రేడియో ఉద్యోగంలో వున్న 1971-97 మధ్య కాలంలో ఎన్ని రచనలు చేశానో ఎన్ని రకాల రచనలు చేశానో నాకే తెలీదంటే మీరు నమ్మాలి! ముఖ్యంగా ఆదివారాల్లో మధ్యాహ్నం పూట ప్రసారమయ్యే కార్మికుల కార్యక్రమం కోసం దాదాపు 13 సంవత్సరాలపాటు 'బాలయ్య'గా పాల్గొంటూ (చిన్నక్కా ఏకాంబరాలతో) కొంత వినోదాన్నీ ఇంకొంత విజ్ఞానాన్నీ మరికొంత సందేశాన్నీ జోడిస్తూ పది నిమిషాల ‘స్కిట్స్’ వారానికొకటి చొప్పున రాశాను.
రేడియోలో నాటక విభాగం ప్రయోక్తగా పనిచేసేటప్పుడు అందులో ప్రసారం కోసమే నా కథలు కొన్నింటిని నాటకాలుగా, నాటికలుగా అనుసరించాను... దాదాపు ఓ ముప్పయ్ వరకూ వుంటాయి.... రేడియో మాధ్యమానికే కాకుండా కొన్ని కొన్ని పత్రికలకు వ్యాసాలూ, కవితలూ కూడా రాశాను... అలా వచ్చిన రచనల్లో ప్రస్తుతం నా దగ్గర కనిపించిన కొన్నింటిని ఏర్చి కూర్చి పుస్తకంగా తీసుకురావాలన్న నా చిరకాల సంకల్పానికి - నా పిల్లలు చేసిన రూపకల్పనే ఈ "తరంగిణి".
- జీడిగుంట రామచంద్రమూర్తి
