• Taralu Antaralu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • తరాలు అంతరాలు (free)

    Taralu Antaralu - free

    Author:

    Pages: 112
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఆచార్య శేషయ్య కందమూరుగారు తన నవల ‘తరాలు అంతరాలు’లో మన సమాజంలోని మానవ సంబంధాల రుగ్మతలు, ముఖ్యంగా కుటుంబ వ్యవస్థలోని మూడుతరాల వారిపై సమస్యల ప్రభావమును స్పష్టంగా చిత్రీకరించారు.

‘తరాలు అంతరాలు’ కథావస్తువు ప్రస్తుత సమాజపు నిజస్వరూప ప్రతిబింబమని చెప్పవచ్చును. ఇది ఒక జరిగిన కథగానే చదువరుల కనులముందు కదలాడుతుంటుంది - ఇది ఒక సందేశాత్మక నవల.

చేసిన తప్పిదములను సరిదిద్దుకొనుట, మాతృత్వాభిలాష, సేవకుల, యజమానుల కృతజ్ఞతాభావము, అననుకూల పరిస్థితులు, పిన్నవయస్సులోనే వ్యక్తిత్వ పరిణితిని పొందేట్లు ఎలాచేస్తాయో, ఆస్తులు సోదరసోదరీ సంబంధాలను ఎలా దెబ్బ తీస్తాయో, మోహతాపము, శృంగారావేశముల దుష్ఫలితాలు, వృద్ధుల యెడల సంతానపు నిరాదరణ, వృద్ధుల నిస్సహాయ స్థితి ప్రభావము, జీవితముపై ఆశను పెంపొందింప జేసే స్నేహితుల ప్రోత్సాహ సహకారములు, నేటిసమాజంలో ప్రాక్ పశ్చిమ సంస్కృతుల మధ్య విజృభింస్తున్న ఆధిపత్య పోరు, విదేశాలలోని మన సంతతి, అభిలాషవున్నా, స్వదేశానికి తిరిగి రాలేని సంకటస్థితిలో తల్లిదండ్రుల అభిప్రాయములను తృణీకరించుట మొదలగు విషయములన్నింటిని పాత్రలలో ప్రస్ఫుటంగా యిమిడ్చి, మూర్తీభవింపజేసి, సమాజం కొరకు, భావితరాల కొరకు ‘తరాలు అంతరాలు’ అనబడే ఎగ్జిబిషన్లో ఉంచారు రచయిత గారు. ‘తరాలు అంతరాలు’ ఖచ్చితంగా సాహిత్య ప్రయోజన సిద్ధిని పొందగలదని నా ప్రగాఢ నమ్మకము.

శేషయ్యగారి రచనా విధానము చదువరుల మనస్సులను హృదయాలను స్పందింపచేసి, వారిలో సంస్కరణాభిలాషను కలిగింపజేస్తుంది కూడా. ముఖ్యంగా ఒక సన్నివేశము నుండి మరొక సన్నివేశవర్ణనకు ఉపక్రమించేముందు వారు, తార్కికంగా, విశ్లేషణాత్మకంగా ప్రెజంట్ చేసే ముగింపు లేదా ముక్తాయింపు వాక్యాలు చదువరులలో, సమాజ పరిశీలన మరియు సంస్కరణాభిలాషా స్పూర్తిని కలిగిస్తాయనుటలో అతిశయోక్తి లేదు.

‘తరాలు అంతరాలు’ చదివిన ప్రతివ్యక్తి, ముఖ్యంగా తన కుటుంబములోని మూడుతరాల మధ్య నెలకొన్న మానవ సంబంధాల నెలా మెరుగుపర్చుకోవాలో, సమస్యలుంటే వాటిని సున్నితంగా ఎవరి మనసు నొప్పించకుండా ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచింప జేస్తుంది.

ప్రధానంగా మధ్య తరం తల్లితండ్రులు మిగతా తరాలకు వారధి అవుతారు. పై తరాన్ని, క్రింది తరాన్ని సమతౌల్యంతో, ఆదరాభిమానాలతో చూడగల్గుతున్నామా అని, తమను తాము ప్రశ్నించుకునేలా చేస్తుంది ‘తరాలు అంతరాలు’.

- సి.వి.ఆర్. క్రిష్ణమూర్తి