-
-
తప్ష
Tapsha
Author: Siddenky Yadagiri
Publisher: Telangana Rachayithala Sangham
Pages: 151Language: Telugu
కింది కులాల వాండ్లు కథా సాహిత్యాన్ని ప్రపంచీకరణ నుంచే విస్తృతంగా రాస్తున్నరు. ఆ రాసిన సాహిత్యమంతా చరిత్ర కెక్కాలంటే దాన్ని అన్ని వర్గాల వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరముంది. యాదగిరి రాసిన ఇవి చదవాల్సిన కథలు మాత్రమే కాదు, ఆచరించాల్సిన కథలు కూడా! భవిష్యత్ తెలంగాణ బంగారు తెలంగాణగా మారాలంటే సామాజిక తెలంగాణ ద్వారానే సాద్యమని చెబుతున్నాడు. సిద్దెంకి తన కథల పరంపరను కొనసాగించాల్సిన అవసరముంది.
- సంగిశెట్టి శ్రీనివాస్
సిద్దెంకి కథలన్నీ క్లుప్తంగా ఉంటాయి. నేరుగా ఎత్తుగడ విషయంలోకి ప్రవేశిస్తుంది. ప్రతిదీ నిర్దిష్టంగా ఉంటుంది. కథాశిల్పం విషయంలో సిద్దెంకి జాగురూకతతో, ఎరుకతో ఉన్నాడని ఆయన కథలు చదివాక అన్పిస్తుంది. పాఠకులు ఒక కథను చదివాక వాళ్లలో భావ ప్రకంపనం కలిగించడం కూడా శిల్పంలో భాగమే. కథాంశం ఎక్కడా సడలిపోకుండా చివరి వరకు నడిపించడంలో ఈ రచయితకు శ్రద్ధ ఉంది. ఆ పనిని విజయవంతంగా చేశాడు.
- డా. సి. కాశీం
