-
-
తప్పటడుగు
Tappatadugu
Author: Ganti Bhanumathi
Publisher: Ganti Prachuranalu
Pages: 152Language: Telugu
'తప్పటడుగు' నవల చాలా మంచి కథావస్తువు. పెడతోవపడుతున్న యువతరం... అలాంటి పిల్లలని ఎలా దారికి తెచ్చుకోవాలో అర్థంకాని తల్లిదండ్రులు పడే వ్యధ, బాధ ఈ నవలలో కథా వస్తువు. ఇది చదువుతుంటే అవి పాత్రలుగా అనిపించవు. పక్కింట్లో, లేదా మనింట్లోనే జరుగుతున్న సంఘటనలు అన్పిస్తాయి. ఎందుకంటే ఇలాంటి పిల్లలు ఈనాడు ప్రతి ఇంట కన్పిస్తారు.
పిల్లలు తోవ తప్పినప్పుడు పూర్వకాలం తల్లిదండ్రుల మాదిరి తిట్టి, కొట్టి, కట్టడి చేసే రోజులు కావు ఇవి. కఠినమైన చర్యలు తీసుకుంటే పిల్లలు మరింత మొండితనంతో ఏ అఘాయిత్యం చేస్తారో, ఇల్లు వదిలి భవిష్యత్తుని కుక్కలు చింపిన విస్తరిలా చేసుకుంటారేమోనని తల్లిదండ్రుల భయం. ఈ సమస్య ఈనాడు ప్రతి తల్లిదండ్రులు ఎదుర్కొనే పెద్ద సమస్య.
రచయిత్రి ఎంచుకున్న కథావస్తువు ఈనాటి సమాజానిది. కేవలం సమస్యని ఎత్తిచూపమే కాక సమస్యకి పరిష్కారం చూపగలిగారు రచయిత్రి. ఎంచుకున్న కథావస్తువుకి పూర్తిగా న్యాయం చేకూర్చగలిగారు. భావప్రకటన, శిల్పం, చదివించే గుణం అన్నీ సమర్థవంతంగా నిర్వహించారు ఈ నవలలో.
- డి. కామేశ్వరి
* * *
'తప్పటడుగు' నవల సందేశాత్మక నవల. పిల్లలు, తల్లిదండ్రులు కలిసి చదువుకోవలసిన నవల.
ప్రేమ అనే పవిత్రమైన మాటకి అర్థం మారిపోయి, ఉద్రేకం, కామం, ఆకర్షణ, అనేవి ప్రేమగా చెలామణి అయిపోతున్న ఈ రోజుల్లో, గంటి భానుమతిగారు చాలా మంచి నవలని, ఆలోచింపజేసే నవలని పాఠకులకు అందించినందుకు ఆమెను అభినందిస్తున్నాను.
సాధారణంగా నవలల్లో సమస్యలు కనిపిస్తాయి. పరిష్కారాలు పాఠకులకే వదిలేయటం జరుగుతుంది. కానీ తప్పటడుగు నవల సమస్యని చూపటమే కాక పరిష్కారాన్ని కూడా చూపటం విశేషం.
తల్లిదండ్రుల బాధ్యత పిల్లల్ని మరీ ప్రేమగా పెంచేయటం మాత్రమే కాదు, తప్పటడుగుల నుంచి తప్పించటమే అనే గొప్ప సత్యాన్ని ఎంతో సరళంగా, హాయిగా చెప్పారు నవల ద్వారా గంటి భానుమతి.
- డా. ముక్తేవి భారతి
how is it open this book .?