-
-
తప్పక చదవాల్సిన వంద కథానికలు
Tappaka Chadavalsina Vanda Kathanikalu
Author: Dr. Vedagiri Rambabu
Publisher: Sri Vedagiri Communications
Pages: 226Language: Telugu
ఈ 'చదవాల్సిన కథానికలు' అన్నీ కీర్తిశేషులైన రచయితలు రాసినవి. ముఖ్యంగా కథానికా సాహిత్యంలో తొలితరం, మలితరం రచయితలు రాసినవి. ఆ విధంగా ఈ కథానికలు స్వాతంత్య్రానికి పూర్వం, స్వాతంత్య్రానంతరం-తెలుగు సాంఫిుక జీవనాన్ని అద్దంలో కొండలా మనముందుంచుతున్నాయి. డా|| రాంబాబు ఎన్నుకున్న కథానికల ద్వారా ఆనాటి-సంఘపరిస్థితినీ, ఆ సంఘంలో మనుగడ సాగిస్తున్న మనుషుల స్థితిగతుల్నీ మనం కళ్లముందుకు తెచ్చుకోగలుగుతాము. ఉదాహరణకి కవికొండల వెంకటరావుగారి 'జమీందారు'; శ్రీపాదవారి 'అరికాళ్లకింది మంటలు', మల్లాదివారి 'మంత్రపుష్పం', కాళోజి 'తెలియక ప్రేమ-తెలిసి ద్వేషము', పి.వి.నరసింహారావు 'గొల్ల రామవ్వ'... వంటి ఎన్నో కథానికలు మనకు ఆనాటి దేశ కాలపరిస్థితుల నేపథ్యాన్నీ, ఆనాటి సమాజం హోరునీ, ఆనాటి మనుషుల రొదనీ-అందజేస్తాయి.
ఈ కథానికల్లోని వస్తువునీ, శిల్పాన్నీ, శైలినీ వింగించటంలో-డా||రాంబాబు ఉచితరీతిని తన ప్రణాళికని పాటించారు. కథానికా స్వరూపాన్నీ, స్వభావాన్నీ పఠితకు చేరవేయవలసిన సరళమైన పద్ధతిని ఎన్నుకున్నారు. ఈ పరిచయాల్లో చదివించే గుణానికి ప్రాముఖ్యం ఇచ్చారు. ఇది రచయిత విజయానికి తార్కాణం. ఎన్నుకున్న కథానికలన్నీ ఆయా రచయితలకు బాగా పేరుతెచ్చినవి కావటాన సాహిత్య పరిచయం ఉన్న వారికి కూడ వాటిని గురించి మళ్లీ పునశ్చరణం చేసుకోవటానికి ఉత్సాహం కలిగేట్లు ఉన్నాయి-ఈ పరామర్శలు. మరుగునపడిన, మనం మరిచిపోతున్న రచయితల కథానికలు కొన్ని ఈ సంపుటి ద్వారా వెలికి వస్తున్నాయి.
- విహారి
This book contains just introduction of popular Kathanikaas but not actual stories... :-(