-
-
తనువులు కలిసిన శుభవేళ
Tanuvulu Kalisina Subhavela
Author: Jandyam Venkatesh Babu
Publisher: Self Published on Kinige
Pages: 90Language: Telugu
అదిరిపడి సుమతి ఒక అడుగు వెనుక్కు వేసింది. ఆమె తూలిపడుతుందనుకున్న సమన్విత్ చప్పున ఆమె నడుము చుట్టూ ఓ చెయ్యీ, మెడ చుట్టూ మరో చెయ్యి వేసి పొదివి పట్టుకున్నాడు.
అదిరిపాటు నుండి బయటపడ్డాక, తనే స్థితిలో వుందో ఆమె గమనించింది. మెడ చుట్టూ వున్న చేయి విషయం అతడికి తెలుసో లేదో గానీ ఆమె గుర్తించడంతోనే తనువులో ఏవో ప్రకంపనలు మొదలయ్యాయి. అతడి నుండి విడివడమని మనసు చెపుతోంది. విడివడితే ఆ సుఖం దూరమవుతుందని తనువు సహకరించడం మానేసింది. ఆమె తనువులో మొదలైన స్పందన అతడు గుర్తించలేదు.
పిడుగుపడిన పది క్షణాలను గాలి విసురుకు వర్షపుజల్లు లోపలికి చొరబడి వారిద్దర్నీ తాకింది. ఆ జల్లు తనను తాకగానే వళ్ళు జలదరించినట్టుగా ఒక్కసారిగా అతడికి అభిముఖంగా తిరిగింది. ఆమె అలా తిరగడంతో అతడికి ఏదోలా అనిపించింది. కాని తనను తాను సర్దుకొనే ప్రయత్నంలో ధీర్ఘంగా నిశ్వసిస్తూ, తలదించి ఆమె ముఖంలోకి చూసాడు. అప్పుడే ఆమెలో కూడా కదలాడే మార్పు, ఆ కళ్ళలోని కోరిక అతడికి అర్ధమయ్యాయి.
