-
-
తనికెళ్ళ భరణి నాటికలు 45
Tanikella Bharani Natikalu 45
Author: Tanikella Bharani
Pages: 105Language: Telugu
ఇది తనికెళ్ల భరణి రాసిన రెండు నాటికల సంకలనం. ఇందులో గార్ధభాండం, గోగ్రహణం అనే నాటికలు ఉన్నాయి. అంతే కాదు, "ఆటగదరా శివా!!" అనే శివతత్వాలు ఉన్నాయి.
తనికెళ్ళ భరణి సినిమాలలో బిజీ కాకముందు రచించి ప్రదర్శించిన నాటికలివి. వివిధ పరిషత్తులలో ప్రదర్శించబడి, అనేక బహుమతులు గెలుచుకున్న నాటికలివి. నిడివి తక్కువగా ఉండి సులువుగా ప్రదర్శించగల నాటికలు ఇవి. పదునైన సంభాషణలతో నటులను, వీక్షకులను, చదువరులను ఉద్వేగానికి గురిచేసే నాటికలివి. అస్తవ్యస్త సమాజంపై భరణి సంధించిన వ్యంగ్యాస్త్రాలివి.
శ్రీ భరణిగారు శివునకు అర్పించిన 108 కవితా మారేడుదళాల అష్టోత్తరం "ఆటగదరా శివా!!"
గార్ధభాండం ఓ పొలిటికల్ సెటైర్. ఇది భరణి గారి మొదటి నాటిక. ప్రదర్శన జరుగుతోంటే.. " 'అరెస్ట్ చేస్తారేమో గురూగారూ' అని ఎవరో దేశిరాజు హనుమంతరావుగారితో అంటే 'మనిషి ఒక్కసారే ఛస్తాడు - ఆడనివ్వరా... అర్థవంతంగా ఉంది నాటకం' అని ఆశీర్వదించారు." అని అంటారు భరణి 'గార్ధభాండం' గురించి.
"మొదట ఇది వీధినాటకంగా రాశా. నిజాం కాలేజీలో వేశాం. అద్భుతమైన స్పందన. దాంతో పరిషత్తుల్లో మొదలెట్టాం." అని అంటారు భరణి 'గోగ్రహణం' గురించి.
ఈ నాటికలు చదవడం గొప్ప అనుభవం.
* * *
![]() | ఈ నాటిక రాయడానికి రచయితకి పెన్నొకటే చాలదు - వెన్నెముక కూడా కావాలి! |
![]() | ఇంతకాలం నాటకం రాస్తానని బెదిరించేవాణ్ణి ఇంకరాయను! ఎంచేతంటే నేననుకున్నది భరణి రాసేశాడు |
![]() | ప్రతి సోమవారం ప్రభాతవేళ పఠించాల్సిన ఆధునిక శివకావ్యం "ఆటగదరా శివా!!" |
I have rented it but It's not downloading