-
-
తలుగు
Talugu
Author: Vempalle Shariff
Publisher: Sufi Prachuranalu
Pages: 28Language: Telugu
Description
"మీ బోరేవాళ్ళు జేచ్చాండే పనికి మా అట్లాంటోళ్ళకు గుడక సెడ్డపేరు వొచ్చాండాదయ్యా. మీకేం గొడ్లను కోచ్చారు, తింటారు, మల్లా అమ్ముతారు. ఎబ్బుడన్నా కర్మగాలి ఇట్లా ఎదురయ్యి మీతో కనబడినామే అనుకో... ఇంగ మేముగూడా తింటాండమన్నట్టే లెక్క. మేము తినం సోమీ... అని ఎంతసెప్పినా ఎవరూ నమ్మడం ల్యా. ఆకరికి మా ఇండ్లలో ఆడపిల్లోళ్లకు సమ్మందాలు గుడక రావడం లేదనుకో..." ముఖం నవ్వుతూనే ఉంది కానీ కరీంసాబ్ గొంతులో మాత్రం కఠినత్వం దొర్లింది.
ఎంచెప్పాలో కాసేపు అర్థం కాలేదు దౌలుకు.
"ఇది గడక ఒకందుకు మంచిదే గదన్నా. ఇబ్బుటికైనా మీరు రోంతైనా అర్తమయ్యింటాది. ఒక తిక్కు హిందువులు తక్కవగా జూచ్చా మరోతిక్కు సాయిబూలు అయ్యిండి గుడక మీరూ తక్కవగా జూచ్చా... మేమెంత ఇబ్బంది పడతాండామో.." అన్నాడు దౌలూ.
Preview download free pdf of this Telugu book is available at Talugu
Login to add a comment
Subscribe to latest comments
