-
-
తల్లీ! నిన్ను దలంచి
Tallee Ninnu Dalanchi
Author: Dr. Papineni Sivasankar
Publisher: Amaravathi Publications
Pages: 368Language: Telugu
ప్రాచీన కవిత్వంలో అతిమానుషమైన లేదా దైవీయమైన అంశాలెన్నో వస్తాయి. దేవుడున్నాడో లేడో నాకు తెలియదు. దేవుడు సందేహం కావచ్చు, భక్తుడు నిజం. భక్తకవి అస్తిత్వవేదన నిజం. ఆత్మవేదన లోంచి వచ్చిన ఏ భావోద్వేగాన్ని మనం తక్కువ చేసి చూడనక్కర లేదు. దేవుడిపై అవిశ్వాసం అన్నమయ్య కీర్తననో, పోతన గజేంద్రుడి ఆర్తినో ఆస్వాదించడానికి అడ్డం కాబోదని నా అవగాహన.
- డా. పాపినేని
* * *
ప్రాచీన సాహిత్యంలో జీవధాతువుగల అమూల్య పద్యబీజాలెన్నో కనపడతాయి. అవి మానవ సంబంధాల్ని మౌలికంగా నిర్వచించి వ్యాఖ్యానిస్తాయి. విద్యార్థులు మొదలు గృహస్థుల దాక జీవనకళ నేర్పుతాయి. జీవిత సంస్కారాలని పండిస్తాయి. అంతిమంగా ఒక ఆరోగ్యదాయకమైన వ్యక్తిగత, సామాజిక సంస్కృతిని పాదుగొల్పుతాయి. సమకాలీనత గల అటువంటి రచనలను శోధించి, వివరంగా విశ్లేషించి, భాషా సాహిత్యాభిమానులకు పరిచయం చేస్తుందీ గ్రంథం.
కథ, కవిత, విమర్శ రంగాలలో 'సాహితీ త్రిముఖుడు'గా పేరొందిన అగ్రశ్రేణి రచయిత డా. పాపినేని శివశంకర్. తెలుగు, ఆంగ్ల, సంస్కృత భాషా సాహిత్యాలపై సమానాధికారం కల శివశంకర్ ప్రాచీన సాహిత్యం అన్వేషించి చేసిన ఈ విశ్లేషణలు అమెరికాలో వెలువడే 'తెలుగునాడి' పత్రికలో ధారావాహికంగా సాహిత్యాభిమానులను అలరిస్తున్నాయి.
Excellent book. Pl do not miss. Buy or gift and read..thanks..