-
-
తాళపత్ర గ్రంథం
Talapatra Grantham
Author: Mydhili Venkateswara Rao
Pages: 400Language: Telugu
మన పురాణాల్లోనూ, ఇతిహాసాల్లోనూ, వేదాల్లోనూ ఎన్నో అమూల్యమైన ఆచారాలూ, నమ్మకాలతోపాటు, ఆరోగ్యాలకి సంబంధించినవీ పొందుపరిచారు. అలాంటివి తెలుసుకోవటం ద్వారా, ఆచరించటం ద్వారా ఆరోగ్యమూ, జ్ఞానమూ, పుణ్యం. అంతటి అమూల్య విషయాలను వినగానే, చదవగానే తెలిసినట్లుంటుంది. కాని అంతరార్థము బోధపడదు. ముక్కోటినాడు ఉత్తరద్వార దర్శనము చెయ్యాలని తెలుస్తుంది. అలాగే స్త్రీలు గర్భం ధరించినప్పుడు బైటికెళ్ళ కూడదంటారు. కానీ దేనికి? వాటి వల్ల మంచేమిటి? వినకపోవటం వల్ల అనర్థమేంటి?
ఈ గ్రంథం కోసం రామాయణాది, భారత, భాగవతములు, చరక సంహిత, పతివ్రత గాథలూ, పురాణాలూ, మనుస్మృతీ, వర్ణాశ్రమ ధర్మాలూ, నిర్ణయ సింధూ, మహామహా ఆధ్యాత్మిక జీవిత పురుషుల చరిత్రలూ, అనేక పత్రికలూ, చాణక్య, భర్తృహరి, విదుర వంటి నీతి శాస్త్రాలూ, శౌనకాది మునుల గాథలు వంటి వాటి నుంచి సేకరించాను.
ఈ పుస్తకం కోసం ఎన్నో వందల పుస్తకాలను కూడా పరిశీలించాను. ఎంతో మంది పెద్దలనూ, స్వామిజీలనూ, భక్తులనూ నాకు తెలియనవి అడిగి అది ఎందుకూ, అని అడిగి మరీ చెప్పించుకున్నాను. దేవాలయాలకీ, పుజాదికాలకీ, యజ్ఞాలకీ వెళ్ళినప్పుడు అక్కడి యజ్ఞకర్తలను ఏ సందేహం కలిగినా ఓపికగా ఉండి తెలుసుకొని చెప్పించుకోవటం జరిగింది. వారందరికీ నా ప్రణామాలు.
పెద్దలు పెట్టిన ఆచారాల్లో అంతరార్థము ఒక్కటే కాదు. ఒక్క ఆచారం వల్ల ఎన్నో రకాలుగా ప్రయోజనాలున్నాయి. అందుకే ఈ తాళపత్ర గ్రంథంలో ఆయుర్వేదం, ఆధ్యాత్మిక, దైవ, ఆచార్య, నమ్మకాల్లో మర్మలూ, ధర్మాలూ, ఇలా ఎన్నో విషయాలను సమపాళ్ళలో మేళవించటానికి నా వంతు ప్రయత్నం చేశాను.
- మైథిలీ వెంకటేశ్వరరావు

- ₹280.8
- ₹233.28
- ₹125.28
- ₹233.28
- ₹125.28
- ₹233.28