• Tadi Arani Nela
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 61.2
    72
    15% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తడి ఆరని నేల

    Tadi Arani Nela

    Publisher: Palapitta Books

    Pages: 119
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

మరల మరల చదవాలనిపించే మంచి కవిత్వం రాస్తారు అరసవిల్లి కృష్ణ. అతను ఎంత సున్నితమో అతని కవిత్వమూ అంతే సున్నితమూ. కృష్ణ చాలా ఏళ్ళుగా కవిత్వం రాస్తున్నారు. అతని కవిత్వం చాలా కాలం నుంచి సాహిత్య పాఠకులకు పరిచితమే. ఆ కవిత్వాన్ని ఒక ఒక పుస్తకంగా చదివినప్పుడు అతని కవిత్వంలోని మేలిమి, సాంద్రతలు పాఠకానుభవ పరిధిని విస్తృతం చేస్తాయి. ఇన్నాళ్ళకు, ఇన్నేళ్ళకీ తన తొలి కవితాసంపుటిని పాఠకుల ముందుకు తీసుకువస్తున్న అరసవిల్లి కృష్ణకు అభినందనలు.

- గుడిపాటి

* * *


ఇవాళయినా, రేపయినా
సౌందర్యం, ఎర్రకణంలా మారవచ్చు.
సౌందర్యవంతమయిన దేశం
సముద్రాన్ని అద్దంగా చేసుకోవచ్చు.
నా దేశంలో మనిషి
ఒకే రైలు పట్టాపై నడుస్తున్నాడు
రైలు ఎప్పుడయినా దుఃఖించవచ్చు

ఏడ్వడానికి పచ్చని పంటపొలాలు
సిద్ధంగా ఉంటాయి
నా లోపల దాచుకున్న భూగోళం
నా లోపల నాటుకున్న జెండా
నా లోపల మొలిచిన చెట్టు
ప్రపంచం ఖాళీగా ఉంది
'నిశ్శబ్ద భూమి'పైకి సూర్యుడు
రోజూ వచ్చి పోతాడు

Preview download free pdf of this Telugu book is available at Tadi Arani Nela