-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
తానా సజీవ చరిత్ర (free)
TANA Sajeeva Charitra - free
Author: Narisetti Innaiah
Publisher: Self Published on Kinige
Pages: 163Language: Telugu
ఉత్తర అమెరికా తెలుగు చరిత్రలో తానాకు ప్రత్యేక స్థానం ఉన్నది. 40 ఏళ్ళ ప్రాయానికి చేరుకుంటున్న తానా 19 సమ్మేళనాలు వైభవంగా జరుపుకోగా, వాటిని మహాసభలుగా పేర్కొంటున్నాము. 2015లో 20వ సభకు దారితీస్తున్న తానా, మోహన్ నన్నపనేని అధ్యక్షతన ఈ చరిత్రను తెలుగులో, ఇంగ్లీషులో ప్రజలకు అందిస్తున్నది.
సభలను రెండేళ్ళకొకసారి ఒక్కొక్క ప్రాంతంలో జరుపుతుండగా, నిరంతరంగా వివిధ జనసేవలు అందిస్తున్న తానా పౌండేషన్ ద్వారా, ఇతరేతరంగా తెలుగు ప్రజలకు సన్నిహితమవుతున్నది. ప్రతి పర్వానికి ప్రచురించిన ప్రత్యేక సంచిక (సావనీర్) రచయితలను, కవులను, కళాకారులను, ఆహ్వానించి వారి విశిష్ట సందేశాలను ప్రజలకు అందించింది. తానా పత్రిక ప్రతి నెలా తెలుగువారికి వెలుగునిస్తూ పయనం సాగిస్తున్నది. తానా చరిత్ర సజీవం అనడానికి కారణం దీనికి ఆది ఉన్నది గాని, అంతం లేదు. ప్రస్తుతం ఈ చరిత్ర రాసే సమయానికి మోహన్ నన్నపనేని అధ్యకుడుగా, డా. జంపాల చౌదరి కార్యనిర్వాహక ఉపాద్యకుడుగా, సతీష్ వేమన కార్యదర్శిగా ఎన్నికై తమ సంఘంతో నిర్విరామ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాటికి అర్హ స్థానం ఈ చరిత్రలో చూడవచ్చు.
2015లో జులై మొదటి వారంలో జరుగనున్న తానా 20వ మహాపర్వాన్ని నాదెళ్ళ గంగాధర్ కన్వీనర్ గా, తమ జట్టు సహకారంతో నిర్వహించడానికి ఉద్యుక్తులవుతున్నారు. వారికి చేయూత నివ్వడానికి వందలాది తానా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ఈ సభల ముగింపులో అధ్యక స్థానాన్ని డాక్టర్ జంపాల చౌదరి స్వీకరిస్తారు.
ప్రతి తానా మహాసభ భక్తితో ఆరంభమై, రక్తితో రంజింపజేసే విధంగా ఇప్పటివరకూ జరగడం చరిత్రలో భాగం. ప్రత్యేక అతిథులతోబాటు స్థానిక ప్రతిభను గుర్తించి వివిధ కళాకారులను రచయితలను వేదికపైకి తెచ్చి గుర్తింపునిచ్చి సమాజానికి సేవ చేయటం గమనార్హం. సాహిత్యం, వాణిజ్యం, వైద్యం, స్త్రీ సమస్యలు చర్చించడానికి విడివిడిగా సమావేశాలు జరిపారు. భరతనాట్యం, కూచిపూడి, బాలివుడ్ ఫ్యూజన్, ఏకాంకికలు, అష్టావధానాలు, ఏకపాత్రాబినయాలు తానా సభల ప్రత్యేకతలు. ఏ రంగంలో ప్రతిభ కనబరిచినా వారిని పిలిచి యధాశక్తి తానా అవార్డులు ఇచ్చింది సత్కరించింది. తోటి సంఘాలను పిలిచి సన్నిహితత్వాన్ని కనబరిచింది.
సుప్రీంకోర్టు మొదలు పార్లమెంటు వరకు ఎందరో నిష్ణాతులను పిలిపించి తెలుగువారికి సందేశాలు అందింపజేశారు. అమెరికా సమాజంలో ఉన్న పరిపాలకులను తానాకు పిలిచి కలిసిమెలిసి పోయేతత్వాన్ని ఆచరణలో చూపారు. తెలుగువారి ప్రత్యేక వంటకాలు సభలలో అందరూ మెచ్చుకునే విధంగా విందు చేశారు. ప్రతి తానా మహాసభకి ఒక్కొక్క విశిష్టత ఏర్పడింది. అదే చరిత్రలో నిలుస్తుంది. అది అందించటమే ఈ రచన ఉద్దేశ్యం.
- నరిసెట్టి ఇన్నయ్య

- FREE
- FREE
- ₹162
- ₹129.6
- FREE
- ₹129.6