-
-
స్వీట్ హోమ్
Sweet Home
Author: Ranganayakamma
Publisher: Sweet Home Publications
Language: Telugu
స్వీట్ హోమ్ నవల మొదటి భాగం 1967లోనూ, రెండవ భాగం 1968లోనూ, మూడవ భాగం 1999లోనూ వెలువడ్డాయి. 2004లో ఈ మూడు భాగాలూ కలిపి ఒకే సంపుటంగా వెలువడింది.
ఈ నవల విమల, బుచ్చిబాబు అనే భార్యభర్తల కథ. బుచ్చిబాబుకి, 'భర్త స్వభావం' లేదు. భార్య మీద పెత్తనాలు చెయ్యడం, ఆధిక్యత కోసం తహతహలాడడం చెయ్యడు. విమలకి కూడా 'భార్య స్వభావం' లేదు. భర్త ముందు పిరికిగా, జంకుగా లొంగుబాటుగా ప్రవర్తించదు. ఇద్దరూ చనువుగా, స్నేహంగా ఉంటారు.
కొంతమంది మనుషులు తెలియకే తప్పులు చేస్తారు. తప్పు చేసినట్టు తెలుసుకోగానే దాన్ని సరిజేసుకోడానికి తహతహలాడుతారు. విమలా బుచ్చిబాబు అలాంటి వాళ్ళే. మరి వీరి కథ చదువుకోడం, వీళ్ళని తెలుసుకోడం పాఠకులకు ఆసక్తిగా ఉండదూ?
సంసారంలో కలకాలం కలసిమెలసి సాగేందుకు, నిండైన జీవితం గడిపేందుకు భార్యభర్తలు ఎలా నడుచుకోవాలో సూచించే కథ ఇది. కథ హాస్యంగా సాగుతూనే, భార్యభర్తలు ఒకరితో ఒకరు ఎలా మెలగాలో, పిల్లలతో ఎలా ప్రవర్తించాలో చెబుతుంది.
ఒక ఇల్లు నిజంగానే స్వీట్ హోమ్ అవ్వాలంటే, స్త్రీ పురుషులిద్దరూ చాలా జ్ఞానవంతులై వుండాలి, మంచి చెడ్డల విచక్షణ గల వాళ్ళై వుండాలని అంటారు రచయిత్రి.
I enjoyed reading this book. Its a good read. Intensively talks about "stree sweccha" / Women freedom in the society and as a wife. There are lots of women who are similar to certain characters in this novel, such as Poorna/Annapoorna who can't oppose her husband's deeds and superstitions. And other characters like Lavanya, who talks about the over freedom.
Ranganayakamma gaaru impresses with her reason for every statement given by Vimala, female protagonist of the novel.
I will suggest to read this one.
Old tamarind chutney! Boooooooring!