-
-
స్వాత్మకథ
Swatma Katha
Author: Multiple Authors
Publisher: Bommidala Srikrishnamurthy Foundation
Pages: 452Language: Telugu
మానవజీవితం నవరసభరితం. ఈ లోకంలోకి ఎందుకు వచ్చామో, లోకం విడిచి ఎక్కడకు వెళతామో ఎవరూ విడమరచి చెప్పలేరు. వేదాంతులుగాని, యోగులుకాని అనేక ఊహలను ప్రతిపాదిస్తారు. వీటి ప్రాతిపదికపై ఎన్నో మతాలను, అభిమతాలను సృష్టిస్తారు. వీటికోసం స్పర్ధిస్తారు, తగవులాడుకుంటారు. ఇది ఎన్ని వేల, లక్షల, కోట్ల సంవత్సరాల నుంచి జరుగుతున్నదో ఇదమిత్థంగా ఎవరూ చెప్పలేరు. అందరిమాటా అందరూ ఒప్పుకోరు. ఎన్నో తత్త్వచింతనలు ఈ ప్రపంచంలో సంఖ్యాతీతంగా చెలామణి అవుతున్నాయి.
నా లెక్కేమిటి? నా పత్రమేమిటి? నా కథ ఏమిటి? నా వ్యధ ఏమిటి? కొందరు ధనికులు, కొందరు పేదలు, కొందరు తత్త్వవిదులు, కొందరు మూర్ఖులు, కొందరు వికలాంగులు, కొందరు పరమసుందరులు, కొందరు దుఃఖితులు, కొందరు సుఖస్వాంతులుగా ఈ లోకం ఎందుకు ఇట్లా మనకు కనపడాలి? సంతృప్తికరమైన సమాధానం ఎవరి నుంచీ ఆశించలేము! మంత్రము, తంత్రము, యంత్రము కొంతవరకు దుఃఖాపనోదనకు తోడ్పడతాయని కొందరంటారు. శతాధిక, సహస్రాధిక గ్రంథాలు, ఉపన్యాసాలు, పత్రికలు, ప్రబోధాలు దేశదేశాలలో ఈ ప్రపంచంలో పుట్టాయి. అయినా ఇంకా ఎడతెగని ప్రశ్నలు; సశేష ప్రశ్నలు; అశేష సందేహాలు.
నేను అంటే ఏమిటో, ఎవరో తెలుసుకో! అన్ని ప్రశ్నలూ విడిపోతాయి అంటారు భగవాన్ శ్రీ రమణమహర్షి! అది ఎందరికి సాధ్యం! బోధ్యం. 'దినయామిన్యౌసాయం ప్రాతః, శిశిర వసంతౌ పునరాయాతః' అని శంకర భగవత్పాదుల వక్కణం. అట్లానే ఈ లోకంలోకి నిరంతరం మనుషులు, జంతుపశుపక్ష్యాదులు వస్తున్నారు! పోతున్నారు!! సాహిత్యం, సంస్కృతి, కళలు, కోలాహలం యథాపూర్వకంగా, నవనవంగా సాగిపోతున్నాయి.
నేను రచయితను ఎందుకైనానో, ఎట్లా అయినానో చెప్పటం కష్టం. ఈ అభినందన సంపుటంలో ఎందరో మిత్రులు, ఆప్తులు, శ్రేయస్సంధాతలు నా గూర్చి ప్రేమాభిమానాలతో మమత్వంతో చాలా విషయాలు నా యోగ్యతకు, అర్హతకు మించి ఎంతో ప్రతిపాదించారు. ఆదివాళ్ళకు తెలియదు. నాకు తెలుసు. ఇది కాలక్రీడ.
నిన్నాడనేల నీరజాక్ష, కన్నవారిపై కాకయునేల?
కర్మానికి దగినట్లు, కార్యములు నడచేని
పుణ్యానికి దగినట్లు పూనికలు పుట్టేని”
అన్నారు త్యాగరాజస్వామి.
నా పుణ్యంవల్ల బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ అధిపతియైన బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తిగారి ప్రాపు నాకు ఈ పెద్దవయసున లభించింది. లేకపోతే ఈ అభినందన సంపుటం ఎట్లా వెలుగు చూస్తుంది?
ఏది ఎప్పుడు సంభవమో, ఏది ఎందుకు అసంభవమో ఎవరికి తెలుసు? ఎవరికీ తెలియదు. ఈ సంపుటి పేరు “స్వాత్మకథ' కాబట్టి స్వాత్మీయమైన ఈ నాలుగు మాటలు రాయవలసిన అగత్యం ఏర్పడింది. అంతఃకరణతో రాసినవి ఈ మాటలు.
- మీ అక్కిరాజు రమాపతిరావు
గమనిక: " స్వాత్మకథ " ఈబుక్ సైజు 11mb

- FREE
- FREE
- ₹180
- FREE
- ₹270
- FREE