-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
స్వతంత్రత నుండి.. స్వాతంత్ర్యానికి (free)
Swatantrata Nundi Swatantryaniki - free
Author: Dr. J. Kanakadurga
Publisher: Jankadu Prachuranalu
Pages: 464Language: Telugu
స్త్రీలసాహిత్య ప్రాముఖ్యత( క్రీ.శ 1900-1947)
భారతదేశ స్వాతంత్ర్యోద్యమానికి భూమికయైన సంఘసంస్కరణోద్యమం క్రీ.శ.1900 సంవత్సరానికి ముందునుండే ప్రారంభమై స్త్రీలలో వ్యక్తిస్వాతంత్ర్య చైతన్యాన్ని రగిలించింది. అది క్రమంగా దేశస్వాతంత్ర్య సాధనదిశగా కూడా సాగి 1947 సం. వరకు దాదాపుగా 50 సంవత్సరాలపాటు వివిధ సాహిత్యప్రక్రియలలో ప్రతిఫలించింది. అంటే ముందుగా స్త్రీలు తమ వ్యక్తిస్వాతంత్ర్యసాధనకై ప్రయత్నంచేస్తూ, సమాంతరంగా దేశస్వాతంత్ర్యసాధనకు కృషి చేయటాన్ని ఈ స్త్రీలసాహిత్యం స్పష్టంచేసింది. దానిని వెలుగులోకి తీసుకురావటానికి చేసిన ప్రయత్న ఫలితమే `స్వతంత్రత నుండి... స్వాతంత్ర్యానికి` అనే ఈ పుస్తకం.
స్త్రీ, పురుషులు భారతదేశానికి ఆర్థిక, రాజకీయ స్వాతంత్ర్యం రావాలని కృషిచేస్తే, స్త్రీలు వారితోపాటు దేశస్వాతంత్ర్యంకోసమే గాక అదనంగా తమ వ్యక్తిస్వాతంత్ర్యసాధనకై సమాంతరంగా పోరాడవలసి వచ్చింది. దానికోసమై స్త్రీలు సాంఘిక, రాజకీయ, ఆర్థికహక్కుల చైతన్యాన్ని పొందే క్రమాన్ని నాటి స్త్రీలసాహిత్యం ప్రతిఫలించింది. స్త్రీల అనుభవాలే సామాజిక సంస్కృతిని అధిగమించే చైతన్యాన్ని కలిగించాయి.ఆ చైతన్యం క్రియాశీలకమై వీరిలో నిర్ణయాత్మక సామర్థ్యాన్ని పెంచింది. వారి వాస్తవిక చైతన్యం సామాజిక-సాంస్కృతిక మార్పును కోరుకొని స్త్రీల విముక్తికై దారులను ఏర్పరచాయి.
సంఘసంస్కరణ, స్వాతంత్ర్యోద్యమ కాలంలో ఉన్న సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, స్త్రీలలో కలిగిన వ్యక్తిస్వాతంత్ర్యసాధన, దేశస్వాతంత్ర్య సాధనల భావజాల పరిణామాలను, వారి క్రీయాశీల దృక్పథాన్ని ప్రతిఫలింపజేస్తూ స్త్రీలు వివిధ సాహిత్య ప్రక్రియలలో రచనలు చేసారు. అందుకే ఇది ఒక చారిత్రక సాహిత్యస్రవంతి.
ప్రపంచ సాహిత్య చరిత్రలోనే ప్రత్యేకమై, తెలుగుజాతి ఉనికికి, ప్రగతికి, స్త్రీవ్యక్తి స్వాతంత్ర్యానికి, దేశస్వాతంత్ర్యానికి పట్టంకట్టగలిగినది ఈ స్త్రీలసాహిత్య చరిత్రయే. ఎందుకంటే ఇది స్త్రీల కొరకు, స్త్రీలచేత, స్త్రీల యొక్క సాహిత్యంగా చరిత్రలో చోటుచేసుకోవటమే దీని ప్రత్యేకతగా భావించాలి. స్త్రీలసాహిత్యంలో నిక్షిప్తమై, విస్మృతంగా పడిఉన్న ఆ నాటి స్త్రీల ఉద్యమ భావజాలాన్ని తొలిసారిగా వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నంగా `స్వతంత్రత నుండి.... స్వాతంత్ర్యానికి` అనే ఈ పుస్తకాన్ని రూపొందించటం జరిగింది. ఉవ్వెత్తున ఎగసిపడిన వారి విస్తృత చైతన్యాన్ని అంతే వేగంతో, భారతదేశస్వర్ణోత్సవాల సందర్భంలో పాఠకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం జరిగింది.
