-
-
స్వర్ణపుష్పాలు
Swarnapushpalu
Author: Alaparthi Venkata Subba Rao
Publisher: Manchi Pustakam
Pages: 64Language: Telugu
Description
'బాలబంధు' అలపర్తి వెంకట సుబ్బారావు గారు రచించిన బాల గేయ కథామాల "స్వర్ణపుష్పాలు". దీనిలో 43 గేయ కథలు ఉన్నాయి. అందమైన బొమ్మలున్నాయి. చక్కని నీతులు ఉన్నాయి.
* * *
స్వప్న మందున చిట్టి పాపకు
స్వర్గ లోకము కాన వచ్చెను!
అందు నందన వనము కన్నుల
విందు కాగా పాప మెచ్చెను!!
పలు రకమ్ముల పూలు చూచీ
పాప హృదయము పొంగిపోయెను!
కోర్కె నెలకొని ఆత్రముగ జని
కొన్ని పువ్వులు కోయబోయెను!!
ఇంతలోనే వింతగానే
ఇంద్రుడొచ్చీ పాప దాపుకు,
స్వయముగా తను పట్టుకొచ్చిన
స్వర్ణపుష్పా లొసగె పాపకు!
వాసనలు లేనట్టి పూలివి
వద్దు నాకీ పసిడి పువ్వులు!
తుంచి ఇమ్మని పాప కోరెను
మంచి వాసన లున్న పువ్వులు!!
బంగరుకు పెను తావి అబ్బిన
భంగి, మరి ఈ పసిడి పువ్వులు
పరిమళము కల వనెను ఇంద్రుడు
పాప పెదవుల చిందె నవ్వులు!!
Preview download free pdf of this Telugu book is available at Swarnapushpalu
Login to add a comment
Subscribe to latest comments
