• Swargamu Nuvve Narakamu Nuvve
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • స్వర్గమూ నువ్వే నరకమూ నువ్వే

    Swargamu Nuvve Narakamu Nuvve

    Pages: 142
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వ్యక్తిత్వ వికాసం పేరుతో చాలా పుస్తకాలు వెలువడ్డాయి. కానీ, ఈ పుస్తకానికో విలక్షణత, ప్రత్యేకత ఉన్నాయి. మొదటి నుంచి చివరిదాకా ఏకబిగిన చదివింపజేసే విధంగా చక్కటి భాషతో సులభమైన శైలిలో ఈ పుస్తకం రూపుదిద్దుకుంది. ఏ విషయాన్ని ‘ఎక్కడ ప్రారంభించాలి, ఎట్లా నడిపించాలి, ఎప్పుడు ముగించాలి’ అన్న విషయంలో రచయిత విశేషమైన ప్రాపంచిక పరిజ్ఞానం ప్రస్ఫుటంగా తెలుస్తోంది. సృజనాత్మకత మరో చెప్పుకోదగ్గ విశేషం.

రచయితను జీవితపోరాటంలో ఒక యోధునిగా అభివర్ణించిన ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి వివిధ తాత్త్వికుల, ఆలోచనాపరుల దృక్పథాల పట్ల రామచంద్రరాజుకు మంచి అవగాహన ఉందన్నారు. జీవితానికి అర్థముందా లేదా అని ఆలోచిస్తే ప్రతి పనికీ ఓ అర్థముంది. ” నీవు జీవిస్తూనే ఆ అర్థమేమిటో తెలుసుకోవాలి” అని పాఠకులకు సూచిస్తారు.

అదేవిధంగా నీ మనసును జయిస్తే నువ్వో చక్రవర్తివే. 'నీ మనసే నీ జీవితం' అంటారు మరోచోట. 'శ్రద్ధ' అనేది చిన్న పదమైనా ఒక మనిషి పనితనాన్ని, గుణాన్ని తెలియజెప్పేది. ఒక మనిషి గుణాన్ని మాటతో కొలుస్తారు. మాటే మానవ నాగరికత. ప్రతిపనికీ నమ్మకమే పునాది. 'నమ్మితే ఏదైనా సాధ్యం' అంటారు రచయిత. ఇంకోచోట జవజీవాలే జ్ఞాన మంటారు. ఈ విధంగా చెప్పుకుపోతే ఎన్నో జీవిత సత్యాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.

'కాలం నిత్యనూతనమైతే మనిషి ఇంకా నవీనం కావాలి. కాలంతోపాటు మనమూ పుష్పించాలి. కాలం వెంట పరుగెత్తడం ఆధునికత. కాలం కంటే మన చూపు ముందుంచాలి' అన్నారు. “జీవితం ఒకపాట. ఏ రాగంలో నువ్వు శ్రుతి చేసుకుంటావు? కల్యాణి, కాంభోజి, బీంప్లాస్, బిళహరి, భూపాలం, శంకరాభరణం, శివరంజని, శివశంకరి, మోహనరాగాలలో నీకేది కావాలి? ప్రతి రాగానికి ఒక లక్ష్యముంది. కొన్ని లక్షణాలున్నాయి. మరి నీదే లక్ష్యమో, నీకుండాల్సిన లక్షణాలేవో నీవే కూర్చుకోగలవు” అన్నదే ముక్తాయింపు.

- ఇండియా టుడే వారపత్రిక

Preview download free pdf of this Telugu book is available at Swargamu Nuvve Narakamu Nuvve