-
-
స్వర మహర్షి ఇళయరాజా సుమధుర గీతాలు
Swara Maharshi Ilayaraja Sumadhura Geetalu
Author: Dr. Jayanti Chakravarthi
Publisher: Victory Publishers
Pages: 304Language: Telugu
అద్భుతమైన అనితర సాధ్యమైన, అపూర్వమైన ఎన్నో సుమధుర గీతాలని జాతికి అందించిన స్వరమాంత్రికుడు ఇళయరాజా. తన అసమాన ప్రతిభాపాటవాలతో దక్షిణ భారతదేశాన్ని స్వరశ్యామలం చేసిన కర్షకుడు ఇళయరాజా. తాను ఒక తమిళుడిగా జన్మించినా, కేవలం తమిళభాషలోనే గాక, తెలుగు, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లోని చలన చిత్రాలకు సైతం సుమధుర సంగీతాన్నందించి స్వరజ్ఞానిగా ఖ్యాతిపొందారు.
మన తెలుగు చలనచిత్రాల్లో ఇళయరాజా సంగీతాన్ని మాధుర్యాన్ని సంపూర్ణంగా వినియోగించుకున్న ప్రముఖ దర్శకులు కె. విశ్వనాథ్, వంశీ, కె. రాఘవేంద్రరావు. వీరిలో ముఖ్యంగా వంశీ - ఇళయరాజాల కలయికలో వచ్చిన ప్రేమించు పెళ్ళాడు, సితార, అన్వేషణ, ఆలాపన, మహర్షి, చెట్టు కింద ప్లీడర్, లేడీస్ టైలర్, ఏప్రిల్ 1 విడుదల, శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్.. వంటి చలనచిత్రాలు, వాటి లోని గీతాలు ఎంత వైవిధ్యభరితంగా వుంటాయో తెలుగు శ్రోతలందరికీ బాగా తెలుసు. ఇక రచయితల పరంగా చెప్పాల్సివస్తే ఇళయరాజా ఇచ్చే విభిన్నమైన స్వరాలకి (ట్యూన్స్) డా॥ వేటూరి సుందరరామ్మూర్తి, ఆచార్య ఆత్రేయ, సిరివెన్నెల సీతారామశాస్త్రి, వెన్నెలకంటి, జొన్నవిత్తుల వంటి గేయరచయితలు తగిన సాహిత్యాన్ని అందించి అజరామరమైన పాటలు వినే భాగ్యాన్ని తెలుగు శ్రోతలకు అందించారు.
అంతటి స్వరవైశిష్ట్యం కలిగిన ఇళయరాజా గీతాలు ఎప్పుడు విన్నా ఏదో ఒక అనిర్వచనీయమైన అనుభూతి అందరికీ కలుగుతుంది. ఇది ప్రతి ఒక్కరికీ అనుభవైకవేద్యమే. ఆయనది జీవసంగీతం. అందుకే ఆ సంగీతంతో కూడుకున్న సాహిత్యాన్ని పదేపదే పాడుకోవాలనుకునే పాఠకుల కోసం ఆ స్వరసామ్రాట్ స్వరపరిచిన సుప్రసిద్ధ సుమధుర గీతాలని ఒక మాలగా కూర్చి "స్వరమహర్షి ఇళయరాజా సుమధుర గీతాలు" అనే పేరుతో మీకందిస్తున్నాం.
సినీ సంగీతాభిమానులందరినీ ఈ సంకలనం అలరిస్తుందని ఆశిస్తూ....
- డా॥ జయంతి చక్రవర్తి

- ₹64.8
- ₹72
- ₹72
- ₹540
- ₹64.8
- ₹72