• Swapna Sakaram
    • fb
    • Share on Google+
    • Pin it!
  • స్వప్న సాకారం

    Swapna Sakaram

    Publisher: J.V.Publications

    Pages: 200
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

హిరణ్మయిగారు ఎప్పటినుంచో రాస్తున్నా ఈ మధ్య కథలే చాలావరకు ఈ సంపుటిలో చోటు చేసుకున్నాయి. ఆమె కథల సంపుటికి 'స్వప్న సాకారం' అని పేరు పెట్టి పుస్తకంగా తేవాలన్న ఆమె కల నెరవేరినట్లనిపించింది.

ఆమె కథలన్నీ నేల విడిచి సాము చేయని కథలే. ఆమె కథలు మన ఇంట్లో, మన చుట్టుపక్కల బంధువులు, మనం రోజూ చూసే, చదివే సంఘటనలే కనిపిస్తాయి. కథల్లో పాత్రలన్నీ మన చుట్టూ తిరుగాడే మనుషులే, మన ఇంట్లో సమస్యలే అన్నంత సహజంగా ఉంటాయి. సంసారాల్లో ఈతి బాధలు, ఈనాటికీ కన్పించే ఆడపిల్లల వివక్షత, వృద్ధుల సమస్యలు, వారిపట్ల నిరాదరణ, చెయ్యాలని ఉన్నా పిల్లల నిస్సహాయత, అత్తాకోడళ్ళ మధ్య లోపించే సామరస్యం, కొడుకుల నిరాదరణ, అత్తలపట్ల నిరాదరణ తరువాత ఆమె గొప్పతనం తెలుసుకున్న కోడళ్ళు, తల్లుల విలువ తెలుసుకున్న పిల్లలు, పిల్లల పట్ల ఆపేక్ష వదులుకోలేని తల్లిదండ్రులు, ఇలా మనం చూస్తున్న ప్రతీ ఇంట్లో ఉండే సమస్యలే ఆమె కథా వస్తువులు.

- డి.కామేశ్వరి

Preview download free pdf of this Telugu book is available at Swapna Sakaram