-
-
స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి
Swami Vivekananda Sphoorti Rojuko Sukti
Author: Swami Vivekananda
Publisher: Ramakrishna Math, Hyderabad
Pages: 383Language: Telugu
ఆధునికతవైపు పరుగులు పెడుతున్న నేటితరం యువత ఆధునికత అంటే నైతిక, ఆధ్యాత్మిక సామాజిక స్పృహ అనే విలువల పట్ల తిరస్కార భావం కాదని తెలుసుకొనే తరుణం ఆసన్నమయ్యింది. భారతదేశ సాంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకొని, భారతజాతి నిండు గౌరవాన్ని కాపాడుకోవాలన్న తపనతో, ప్రతికూల ప్రాబల్యాలకు లోనుకాకుండా, శక్తిని, ఉత్సాహాన్ని, దేశ భక్తిని, ఆత్మవిశ్వాసాన్ని రగులుకొల్పి మార్గదర్శనం చేసే వ్యక్తి స్వామి వివేకానంద అని యువత గుర్తించింది. ఆయన గురించి, వారు ఇచ్చిన సందేశం గురించి తెలుసుకోవాలన్న తపన యువతలో నానాటికీ పెరగడం ఆనందాన్తి కలిగిస్తుంది.
సరిగ్గా 150 సంవత్సరాల తరువాత జాతి యావత్తూ ఆ నవీన యువసన్న్యాసికి నీరాజనం పట్టడానికి సన్నద్ధం అవుతోంది. ఆయన విశాలమైన ఉదారాశయాలు సర్వజనాంగీకారాన్ని పొందుతున్నాయి.
ప్రతీ కార్యరంగంలోను, ప్రతి ఆలోచనా విధానంలోనూ ఉత్తేజాన్ని కలిగిస్తున్నాయి. సమస్యావలయంలో ఉన్న సమాజంలో ప్రతి సమస్యా పరిష్కారానికి సమాధానాన్ని యువత ఆయన రచనలద్వారా తెలుసుకొంటున్నారు.
‘స్వామి వివేకానంద స్ఫూర్తి.. రోజుకో సూక్తి’ అనే ఈ చిన్న పుస్తకాన్ని యువత ప్రతి రోజు క్రమం తప్పక ఒక సూక్తిని చదివి, స్ఫూర్తిని పొంది ఆచరించగలిగితే; జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
- ప్రకాశకులు

- ₹540
- ₹108
- ₹60
- ₹81
- ₹72
- ₹269.1
- ₹270
- ₹129.6
- ₹108
- ₹180
- ₹270
- ₹540