• Swami Vivekananda Jeevita Katha Vivekananda Cheppina Kathalu
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • స్వామి వివేకానంద జీవిత కథ - వివేకానంద చెప్పిన కథలు

    Swami Vivekananda Jeevita Katha Vivekananda Cheppina Kathalu

    Pages: 99
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ తరం యువత అనేక విధాలైన విలువలనుంచి తమ ఆదర్శాలను, లక్ష్యాలను, పద్ధతులను, జీవన మార్గాలను ఎంచుకోవలసి ఉంది. ఇటువంటి క్లిష్టపరిస్థితులలో ఆధునిక యువతకి ముఖ్యంగా కావలసింది 'ఒక ఆదర్శ వ్యక్తి'. ఎవరినైతే వారు తమ జీవితాదర్శంగా అంగీకరించగలరో, ఎవరిని వారు తమ మార్గదర్శక ప్రకాశంగా అనుసరించగలరో, అటువంటి వ్యక్తి వారికి అత్యావశ్యకం. ఆధునిక యువతకు కావలసిన ఈ అవసరాన్ని వివేకానంద స్వామి జీవితం నెరవేరుస్తుంది.

మహాత్ముడైన వివేకానందస్వామి జీవితమే ఈ పుస్తకంలోని చిన్న సంఘటనలు, చిత్రాల ద్వారా చిన్నపిల్లలకి అందించబడుతున్నది. పిల్లలు ఈ పుస్తకం చదివి, ఉత్తేజితులై, జీవితంలోని ఉన్నత, మహోన్నత లక్ష్యాలవైపు పయనిస్తారనీ, వివేకానంద స్వామి వారి వ్యక్తిత్వాన్ని అవగాహన చేసుకోవడం ద్వారా, వాళ్ళు సాహసవంతులుగా, ధైర్యశాలురుగా ఉండటం నేర్చుకొని, తోటివారి యెడల నిస్వార్థప్రేమ కలిగివుండి, జ్ఞానం, ఇతర సద్గుణాలను అలవరచుకోవానికి ప్రయత్నిస్తారనీ ఆశిస్తున్నాము.

- ప్రకాశకులు

*****

శ్రీ వివేకానందస్వామి విభిన్న సమయాల్లో చేసిన ప్రసంగాల్లో సందర్భోచితంగా, సోదాహరణంగా చెప్పిన మన ప్రాచీన సాహిత్యంలోని ఆణిముత్యాలవంటి కథలు ఈ పుస్తకంలో చోటుచేసుకొన్నవి. తరతరాల మన వారసత్వపు వాస్తవిక భారతీయ సంస్కృతికీ, ధార్మికతకూ ఈ కథలు అద్దం పడుతున్నవి. నేటి బాలురే రేపటి పౌరులు కదా! ఈ బాలుర శీలనిర్మాణ, వ్యక్తి వికాసాలకు ఈ కథలు స్ఫూర్తినిస్తూ, దోహదం చేస్తాయనటంలో సంశయం ఏమాత్రం లేదు.

గమనిక: " స్వామి వివేకానంద జీవిత కథ - వివేకానంద చెప్పిన కథలు" ఈబుక్ సైజు 11 mb
Preview download free pdf of this Telugu book is available at Swami Vivekananda Jeevita Katha Vivekananda Cheppina Kathalu