-
-
స్వామి వివేకానంద
Swami Vivekananda
Author: Swami Jnanadananda
Publisher: Ramakrishna Math, Hyderabad
Pages: 1178Language: Telugu
ఇది స్వామి వివేకానంద సమగ్ర, సప్రామాణిక జీవిత గాథ. రెండు సంపుటాలూ ఒకే ఈ-బుక్‌గా వెలువడుతున్నాయి.
* * *
''స్వామి వివేకానందను కలుసుకొని, ఆయన సాంగత్య భాగ్యం పొందిన మేం నిష్కృమించాక ఆయన సందేశమూ, మహత్కార్యమూ కాలగర్భంలో కలసి పోతాయి. స్వామి వివేకానంద ప్రభావం మనుషుల జ్ఞాపకాల నుండి తొలగిపోయినట్లు అనిపిస్తుంది. నూటయాభై లేదా రెండు వందల సంవత్సరాలు గడచిన తరువాత పరికిస్తే హఠాత్తుగా ఆయన ప్రభావం పాశ్చాత్యదేశాల వైఖరినే ఆమూలాగ్రం మార్చివేసి ఉంటుంది!'' అని సోదరి నివేదిత వ్రాసింది. ఎంతటి ధీర్ఘదర్శితమైన వచనాలు! పాశ్చాత్య దేశాలకు మాత్రమే కాదు, భారతదేశానికి మాత్రమే కాదు, ప్రపంచానికే అన్వయించే భావన ఇది! నివేదిత ఎత్తిచూపిన ఆ కాలఘట్టంలో నేడు మనం నిలబడివుండడం గర్వించదగ్గ విషయం.
నేడు స్వామి వివేకానంద నామధేయం ఇంతకు క్రితం కన్నా సర్వత్రా అత్యంత వేగంగా శక్తిమంతంగా వ్యాపించడం ప్రత్యక్షంగా చూస్తున్నాం. వివేకానంద నామధేయం నేటి మానవ చరిత్రతో విడదీయలేనంతగా ముడిపడి ఉందనడం అతిశయోక్తి కాదు. ఆయన యతిరాజుగా విరాజిల్లారు. అదే సమయంలో, ఆ పరిధిలోనే ఇమిడిపోకుండా దానిని అతిక్రమించి తమ దృష్టిని ఆర్థిక, వైజ్ఞానిక, సామాజిక, మనస్తత్త్వ, వాస్తు, సంగీత శాస్త్రాదులలో సారించి, వాటిపై చెక్కుచెదరని ప్రభావాన్ని పాదుగొలిపారు. నేడు ఆయన ప్రపంచ చింతనా స్రవంతిలో ఒక
నిర్ణయాత్మక మార్పును కల్పించిన వ్యక్తిగా, ఆధునిక ప్రపంచ శిల్పులలో ఒకరుగా శ్లాఫిుంపబడుచున్నారు. ఆయన సమగ్ర జీవిత గాథను తెలుగులో ముచ్చటగొలిపే రెండు సంపుటాలుగా వెలువరించిన తరువాత జనబాహుళ్యంలో ఈ గ్రంథం పొందిన ఆదరణ కనివినీ ఎరుగనిది.
స్వామి వివేకానంద జీవిత చరిత్ర ప్రప్రథమంగా ఆయన పాశ్చాత్య ప్రాచ్య శిష్యులచే రచింపబడి, నాలుగు సంపుటాలుగా ఆంగ్లంలో వెలువడింది. దానికి కొనసాగింపుగా వందలాది పుస్తకాలు వెలువడ్డయి, వెలువడుతున్నాయి. కాని ఇంతదాకా స్వామీజీ సమగ్ర జీవితగాథ తెలుగులో వెలువడకపోవడం పెద్ద కొరతగానే ఉండిపోయింది. అయితే ఆ కొరతను ఈ రెండు సంపుటాలు తీర్చినాయనడంలో ఎటువంటి సందేహమూ లేదు.
'స్వామి వివేకానంద' గ్రంథాన్ని చదివే పాఠకులందరూ స్ఫూర్తిని సంతరించుకొని తమ జీవితాలను సార్థకం చేసుకొంటారని ఆశిస్తున్నాం.
- ప్రకాశకులు
గమనిక: "స్వామి వివేకానంద సమగ్ర, సప్రామాణిక జీవిత గాథ" ఈ-బుక్ సైజు 7.99 MB
- ₹270
- ₹129.6
- ₹108
- ₹180
- ₹270
- ₹108
so good and nice person in world