-
-
స్వామి అభేదానంద - అసమాన యోగిపుంగవుడు
Swami Abhedananda Asamana Yogipungavudu
Author: Ramakrishna Math
Publisher: Ramakrishna Math, Hyderabad
Pages: 106Language: Telugu
నిరుపమాన ఆకర్షణ, ఘనీభవించిన ఆధ్యాత్మిక అనుభవాల ప్రతిరూపమే శ్రీరామకృష్ణులు. అపార కరుణతో, మానవాళి దుఃఖోపశమనానికి అవతరించిన కరుణమూర్తి శ్రీరామకృష్ణులు. శ్రీరామకృష్ణుల సన్న్యాస శిష్యులు సకల సద్గుణరాశితో విరాజిల్లే భగవంతుని దూతలు. స్వామి వివేకానంద నేతృత్వంలో తమ గురుదేవులైన శ్రీరామకృష్ణుల వాణిని మానవాళికి వినిపించిన యువసన్న్యాస శిష్యులలో ఒకరు స్వామి అభేదానంద. పాతిక సంవత్సరాలు శ్రీరామకృష్ణుల వేదాంతవాణిని పాశ్చాత్యులకు తన ఆచరణ ద్వారా అందించిన యోగిపుంగవుడు స్వామి అభేదానంద. భక్తిజ్ఞానయోగాల సమ్మేళనంగా రూపుదిద్దుకున్న విశిష్ట వ్యక్తిత్వం వారిది.
సమాజంలోని మేధావి వర్గం మెచ్చుకునే గ్రంథాలు స్వామి అభేదానంద రచించిన గ్రంథాలు. భారతీయ సంస్కృతి, కళలు, తత్త్వశాస్త్రం, ఆధ్యాత్మికతపై వారు రచించిన గ్రంథాలు బహుళ ప్రజాదరణ పొందాయి. పాశ్చాత్యదేశంలో వేదాంతం గురించి వివరణ ఇస్తూ, “జీవితసమస్యలను పరిష్కరించేది, జీవిత గమ్యాన్ని తెలియజేసేది, జీవన విధానాన్ని మరింత ఉన్నతంగా మలిచేది వేదాంతం. ప్రకృతిలో సహజ సిద్ధంగా విశ్వమాత ఇచ్ఛకు అనుగుణంగా మన ఇచ్ఛను కూడా సమన్వయ పరచడమే వేదాంత లక్ష్యమని” తెలియజేశారు. "ఈ ప్రపంచంలో గల విభిన్న మతాలు, జాతులు, శాఖలు, సంప్రదాయాల మధ్య సమన్వయం, శాంతి, సహనం, సామరస్యాన్ని నెలకొల్పడమే వేదాంత గమ్యం” అంటూ తన ప్రసంగాలలో ఉద్ఘాటించేవారు.
వివిధ రంగాలలో భారతదేశానికి నిస్వార్ధ సేవలు అందించిన పలువురిలో స్వామి అభేదానందను ఒకరిగా భారత ప్రభుత్వం ఎంపిక చేసింది. స్వామి అభేదానంద 150వ జయంత్యుత్సవాలను పురస్కరించుకుని ఆ మహనీయుని జీవితం, సందేశం పది మందికీ తెలియాలన్న ఉద్దేశంతో 'స్వామి అభేదానంద - అసమాన యోగిపుంగవుడు' పుస్తకాన్ని ముద్రించాం. ఆ మహనీయుని స్ఫూర్తి అందరికీ అందాలని మా ఆకాంక్ష.
- ప్రకాశకులు

- ₹129.6
- ₹180
- ₹60
- ₹72
- ₹81
- ₹81
- ₹270
- ₹129.6
- ₹108
- ₹180
- ₹270
- ₹108