• Suryuni Needa
  • fb
  • Share on Google+
  • Pin it!
 • సూర్యుని నీడ

  Suryuni Needa

  Publisher: Srijana Lokam

  Pages: 176
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహించిన నవలల పోటీ-2014లో రూ. 25,000 ఉత్తమ నవల బహుమతి పొందిన నవల "సూర్యుని నీడ".

* * *

కాకతీయుల పరిపాలన తర్వాత అనేకానేక కారణాలవల్ల తెలంగాణా ఒక దుఃఖభూమిగా మిగిలిపోయింది. హైదరాబాద్‌ దేశంగా తన స్వంత సైన్యం, స్వంత కరెన్సీ, స్వంత రైల్వే, తపాలా, జెండ గలిగి నిజాం రాజుల నిరంకుశపాలనలో మ్రగ్గిపోతూ శతాబ్దాలుగా బానిస బ్రతుకులనీడుస్తూన్న జనానికి ఇక తిరుగబడం.. ఆయుధాన్ని పట్టి యుద్ధంచేయడం అనివార్యమై.. పోరాటమే ఇక తమ జీవన విధానమని నిర్ధారించుకుని నిజాం పాలకులకూ,ఆయన తొత్తులైన జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌లు, సర్దేశ్‌ముఖ్‌లు, సుబేదార్లు వంటి స్థానిక దోపిడీదార్ల అణచివేతకూ వ్యతిరేకంగా అక్కడక్కడ వ్యక్తులుగా.. మరికొన్ని చోట్ల సంఘటిత శక్తులుగా తిరుగుబాటును సుదీర్ఘకాలం కొనసాగించి భూమికోసం భుక్తికోసం తరతరాల విముక్తికోసం వందలు వేలుగా తమ ప్రాణ త్యాగాలను చేసి మట్టిని నెత్తురుతో తడిపి పునీతం చేసిన పవిత్ర భూమి తెలంగాణా. రజాకార్ల పాశవిక హత్యాకాండకు ఎదురొడ్డి ప్రతిఘటించి ఒక్క బైరాన్‌పల్లి గ్రామమే దాదాపు నూటాయాభైమంది వీరులను ఈ నేలతల్లికి రక్తపుష్పాలుగా అర్పించింది. తెలంగాణా సాయుధ పోరాటం.. అనేక అజ్ఞాత ఉద్యమాలు.. జన చైతన్య విస్ఫోటనలు.. వెరసి నిన్న మొన్నటిదాకా తెలంగాణా ఒక పోరాటాల పురిటిగడ్డ. వీర భూమి.. విప్లవాల వెల్లువ.. నిప్పుల కొలిమి..అగ్ని గుండం.. వేలమంది అమరుల రక్త తర్పణంతో పునీతమైన మట్టి ఇది.

ఐతే..స్వతంత్ర భారతదేశ ప్రజలకన్నా దాదాపు ఒక ఏడాది తర్వాత స్వతంత్రులైన తెలంగాణా ప్రజలు నిజానికి నిజమైన స్వాతంత్య్రాన్ని పొందనేలేదు. ఆహార్యాన్ని మార్చుకుని అదే భూస్వాములు, జమీందార్లు, జాగీర్దార్లు కాంగ్రెస్‌ తీర్థాన్ని పుచ్చుకుని.. మళ్ళీ ప్రజాస్వామ్య ముసుగులో దశాబ్దాల దోపిడీని కొనసాగించారు. మళ్ళీ అణచివేత.. వెట్టి చాకిరి.. దౌర్జన్యం.. హింస.. ప్రజలను అనివార్యంగా సాయుధుల్ని చేసే నిర్బంధ పరిస్థితులు.. మళ్ళీ మరో స్వాతంత్య్ర పోరాటం కోసం మలిదశ పోరాటాలు.. విప్లవాలు.. అడవులకు అడవులే దద్దరిల్లిపోవడలు.. నిర్బంధాలు.. జైళ్ళు.. ఎన్‌కౌంటర్లు.. కాల్పులు.. రక్తసిక్త అరణ్యాలు మరోవేపు పాలకుల అసమర్థ పరిపాలన, ముందుచూపు లేని ప్రభుత్వాల గుడ్డినడక, శాస్త్రీయ దృష్టేలేని విధానాలు, పిడికెడు మంది లక్షల ప్రజల సంపదను దోచుకుతినే ప్రభుత్వ పాలసీలు.. వెరసీ దేశం నిండా అవినీతి.. లంచగొండితనం..విచ్చలవిడి దోపిడీ ..అతి స్వేచ్ఛ, కలుషిత రాజకీయాలు..నీతిహీన ప్రవర్తనలు.. అనైతిక వ్యూహాలు..దేశం ఒక చెత్తకుండై.. కుళ్ళిపోయింది. ఐతే..ఈ పరిస్థితి ఇలా ఎన్నాళ్ళు..ఈ స్తబ్దతకూ.. అనిశ్చితికీ.. మౌనానికీ.. అంతం ఉందా.

ప్రక్షాళన ఎక్కడ మొదలై.. ఎలా కొనసాగి.. ఎలా తన లక్ష్యాన్ని చేరాలి. మళ్ళీ ఈ పుణ్యభూమిని పరిశుభ్ర ప్రజాక్షేత్రంగా ఎలా పునర్నిర్మించాలి. అనే చింతనతో నిజాయితీ నిండిన పిడికెడుమంది నిజమైన మనుషులు ఇంకా ఉన్నారు ఈ దేశంలో, తెర వెనుక ఇప్పటికి..ఆలోచిస్తూ,సంఘర్షిస్తూ, మథనపడ్తూ, ఒక ప్రతిభావంతమైన మార్గాన్ని అన్వేషిస్తూ జ్వలిస్తున్నారు లోలోపల. సంఘటితమైతే..కొద్దిమందైనా ఈ సమాజ స్వరూప స్వభావాల్ని తప్పనిసరిగా మార్చగలమనే బలమైన సంకల్పంతో వ్యూహాత్మకంగా ముందుకు అడుగులను సంధిస్తే., తప్పక ఈ సమాజం.. ఈ రాష్ట్రం.. ఈ దేశం..ఒక కొత్త శకంలోకి పయనిస్తుందని విశ్వసిస్తూ.. వర్థమాన సంక్లిష్టతలకు ఒక పరిష్కారాన్ని ప్రతిపాదిస్తున్న నవల ఇది.

Preview download free pdf of this Telugu book is available at Suryuni Needa