-
-
సూర్యగ్రహ ఉపాసన
Suryagraha Upasana
Author: Dr. Jayanti Chakravarthi
Pages: 124Language: Telugu
సూర్యగ్రహ ఉపాసన
ఈ కలియుగం గ్రహాధీనం. మానవుల జీవితాల మీద నవగ్రహాల ప్రభావం ఎంతో ఉంది. ప్రతి మనిషి తను జన్మించినప్పటి నుంచీ మరణించేవరకూ వారి వారి పూర్వకర్మ ఫలాలను అనుసరించి, ప్రస్తుత జన్మలో గ్రహస్థితులు నిర్ణయించబడి ఉంటాయి. నవగ్రహాలన్నీ వేటికవే ప్రత్యేకమైన ప్రతిపత్తిని కలిగి వివిధ శుభాశుభాలకు కారణమవుతుంటాయి. ఈ నవగ్రహాలలో మొదటిదైన సూర్యగ్రహానికి ఎంతో ప్రాముఖ్యత వున్నది.
సూర్యగ్రహ ఉపాసన అనే ఈ గ్రంథంలో సూర్యుడికి సంబంధించిన తాంత్రిక మంత్రాలని, వాటిని ఉపాసించే విధానం సవివరంగా అందిస్తున్నాము.
సూర్యగ్రహ మంత్ర జపహోమ విధానాలతో పాటు అదనంగా సూర్యుడి అనుగ్రహం సత్వరం లభించటానికి లాల్ కితాబ్ గ్రంథంలో చెప్పిన సూర్యగ్రహ ప్రభావం - నివారణోపాయాలు, అలాగే సూర్యగ్రహానికి సంబంధించిన కవచ సూత్రాలు, స్తుతులతో పాటు సూర్యగ్రహ అంతరిక్షదేవత అయిన శ్రీ మాతంగీ దేవి స్తోత్రాన్ని, సంఖ్యాపరంగా శ్రీ సూర్యుడి సంఖ్యా విశేషాలను కూడా అనుబంధంగా అందిస్తున్నాము.
ఈ గ్రంథంలో తెలిపిన విధంగా అందరూ సూర్యగ్రహాన్ని ఉపాసించి తద్వారా సూర్యుడి అనుగ్రహంతో సుఖసంతోషాలు పొందవలసిందిగా కోరుకుంటున్నాము.
- డా. జయంతి చక్రవర్తి

- ₹64.8
- ₹72
- ₹72
- ₹540
- ₹64.8
- ₹72