-
-
సూర
Sura
Author: Butham Muthyalu
Publisher: Gumpu Sahithi Samstha
Pages: 108Language: Telugu
నేను సూర నవలని ఆత్మకధనాత్మక శైలిలో రాయాలని అనుకున్న. నా చుట్టూ అల్లుకున్న జీవితాలు, వలస బత్కులు, బతుకుదెరువు ఊగిసలాట, దళితుల అనిచివేత, కులవృత్తుల ధ్వంసం, సాంఘిక బహిష్కరణ మా జీవితాల్లో నిత్యకృత్యాలే. అలా జీవిత యదార్థ గాదే ఈ నవల పేర్లు, పాత్ర పేర్లు. ప్రాంతం పేరు కల్పితమైనా నా జీవిత సంఘటనల రూపమే ఈ నవల. అంబేద్కర్ ఆలోచనా విధానం, గ్రామాల్లో మార్పు రానంతవరకూ రూపుదాల్చదు. అలా జరగాలంటే కులాంతర వివాహాల ప్రోత్సాహం, కులనిర్మూలన, ఇతర మత స్వీకరణ, తమ అస్థిత్వాన్ని తెలపడం, నిల్పుకోడం, అవాంతరాలెన్నైన ఎదురొడ్డి నిల్వడం ఇదే ఈ నవల సారం. ఐతే దళిత నవలల్లో కనిపించని ఒకే ఒక అంబేద్కర్ ఆశయం కులాంతర వివాహం ఈ నవలలో కనవస్తుంది. ఈ నవలను ఆదరించిన, ఆదరిస్తున్న పాఠకులకు కృతజ్ఞతలు.
కాకతీయ యూనివర్సిటీ వారు వేముల ఎల్లయ్య గారి సిద్ది నవలతో పాటుగా సూర దళిత మాండలీక నవలని ఎం.ఎ. తెలుగులో ఫోర్త్ సెమిస్టర్లో సిలబస్లో చేర్చడంతో నా ప్రయత్నం వృదా కాలేదనిపించింది.
- భూతం ముత్యాలు
నమస్తే, మీది నాది భిన్న దృక్కోణం. అయినా మీ రచనలో ఉన్న సహజత్వం నాకు బాగా నచ్చింది. అనేకమంది వామ పక్ష రచయితలు తమ అభిప్రాయాలను వెల్లడించడం కోసం అనేక రకాల అబద్దాలకు, మితి మీరిన అసహజ ప్రయోగాలకు పూనుకొంటున్నారు. అలంటి స్థితిలో మీ ముందు సమాజం లో కనిపించిన విషయాలను ఉన్నది ఉన్నట్లు నిజాన్ని రాయడం ఏ కొద్ది మందికో చెల్లింది. బొజ్జా తారకం, అంబేద్కర్ వంటి రచయితల రచనలు కాల పరీక్షకు నిలువవు ఎందుకంటే వారి వాదనలలో, రచనలలో ఎంతో కొంత అబద్దం దాగి ఉన్నది. మీ రచన వాస్తవ స్థితి గతులను చూపుతూ ప్రజల అంతరంగాన్ని అడ్డం పడుతూ సహజంగా ఉన్నది. ఈ పుస్తకం నా భావజాలానికి విరుద్దమైనా, రచనా శైలికి రచయితకు నా అభినందనలు.