-
-
సుప్త క్షణాలు
Supta Kshanalu
Author: Sripada Swatee
Publisher: Self Published on Kinige
Pages: 159Language: Telugu
వెచ్చని తలపులు కప్పుకున్న శిశిరపు శీల పవనం
నిలువెల్లా మునివేళ్ళతో తడిమి ఊసుల
మధురగానాలు వినిపించే వేళ
మాటల పూరెక్కల మెత్తని నావలో తడిసి తడిసి
పచ్చని గరిక మరకతాల్లా మొలకెత్తుతాను
ఉల్కలుగా వెలుగు ద్వీపాల్లా ఉండుండి
రాలిపడే నవ్వులన్నీ ఏరుకు మల్లెలేరుకుంటాను
మౌనం నా చుట్టూ దట్టగా మంచువానై కురిసినపుడు
లోలోపలి పొరల్లో దాచుకున్న పాటల పొదిలోంచి
ఒక్కొక్క పుష్పకాన్ని బయటకు లాగి
గతాన్ని పొదిగిన వెచ్చని కిరణాల రెక్కల మీద పరుచుకు
పరిమళభరిత వనసీమల చుట్టి వస్తాను
పేరుకుపోయిన మంచు పొరల కింద మునగదీసుకు
బిక్కు బిక్కుమంటూ ఎదురుచూసే
బక్కచిక్కిన వసంతం కళ్ళ కొనల్లో నిలుపుకున్న ప్రాణాలు
వెండి మబ్బలు దాటుకు ఓదార్చే వెలుగు కిరణాల
స్పర్శతో సస్యశ్యామలమైనట్టు
పెదవికొల నుంచి జారిన తొలిపాద్దు పిలుపుకే
ఒళ్ళు విరుచుకున్న వసంతాన్నవుతాను
నాలో నేను హరిత వనాన్నై ప్రవహిస్తాను
సుతిమెత్తని పాదాలను అరచేతుల్లో మోసే నీ ఉనికి
ప్రతి రోజూ నాకో పునర్జన్మే...
