• Sunnitapu Trasu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • సున్నితపు త్రాసు (free)

    Sunnitapu Trasu - free

    Pages: 60
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీ సూరం శ్రీనివాసులు గారు వివిధకాలాలలో వ్రాసిన తెలుగు కవితల సంగ్రహం. అద్భుతమయిన తత్త్వదర్శనం కలిగిన సృజన. వ్యక్తిత్వవికాస బోధకం.

***

కవిత్వానికి మూలం స్పందన. కవిత్వానికి ఫలితమూ స్పందనయే. మూలమైన స్పందనకు కారణాలు అనేకం. ఫలించిన స్పందనకు పర్యవసానాలు అనేకం.

ఎన్నిగీతలు వివరించినా, ఎన్ని నీతులు వల్లించినా, ఎన్ని ఉద్వేగాలైనా, ఎంతటి ఉద్యమాలైనా, కళలైనా, కావ్యాలైనా ఈ విశ్వంలో ఇంత ఉనికి కోసం, అంతులేని కాలంలో తనదైన క్షణం కోసం, ఆ క్షణం పేరే జీవితం. జీవితం ఇలకన్న బరువైంది, కలకన్న మృదువైనది కూడా. వెలకట్టాలని ప్రయత్నిస్తే దాని విలువ అందనిది.

ఓనమాల నాటి నుండే ఆనవాలు పట్టాలనుకొన్నా చితిపై పేర్చే నాటికి కూడా చివరి అక్షరం పూర్తికానిది జీవితం. దానికి కేంద్ర బిందువు 'తాను' అయినా దాని పరిధి ఈ విశాల విశ్వం, బిందువు స్థిరంగా ఉంటే దాని విలువను గుర్తించగలిగితే తాను ప్రశాంతంగా బ్రతికి పదిమందినీ బ్రతికించే ప్రయత్నం చేయవచ్చు.

ఆ క్రమంలోనే నాటి నుండి నేటిదాకా ఆనంత సాహిత్యం వెలువడింది. అయితే ఏ కవి దారి ఆ కవిది, ఏ కవి తీరు ఆ కవిది. అందరి గమ్యం మాత్రం ఒక్కటే. కాకపోతే కొందరు మజిలీలే గమ్యమనుకొంటే కొందరు గమ్యాన్ని కూడా ముజిలీ గానే భావిస్తారు. ఇంకా ఇంకా ముందుకుపోతుంటారు.

ఆ మార్గంలో నడుస్తూ వెలువరిస్తున్న కవితా సంకలనం 'సున్నితపు త్రాసు' తూకానికి ఉపయోగపడితే వాడుకోండి.

- సూరం శ్రీనివాసులు