-
-
సండే కామెంట్స్
Sunday Comments
Author: Vemana Vasantha Lakshmi
Publisher: Perspectives
Pages: 235Language: Telugu
ఈ రచనలన్నీ కూడా సామాన్యుల పక్షాన నిలబడి పాఠకులను ఆలోచింపజేస్తాయి. ప్రజాహితాన్ని కోరుకుంటూనే కొత్త కోణాలను ఆవిష్కరిస్తాయి. ఈ పనిని అవి ఎంతో సున్నితంగా, మనుషుల పట్ల ప్రేమతో, సంఘం పట్ల నిష్ఠతో, పర్యావరణం పట్ల శ్రద్ధతో చేస్తాయి. ప్రతి రచనలోనూ కనీసం ఒకటో రెండో గుర్తుంచుకోవలసిన వాక్యాలూ, ఆగి ఆలోచించాల్సిన సందర్భాలూ కనిపిస్తాయి. మరోవైపు ప్రజాకంటకుల్ని, దుర్మార్గుల్ని, అవినీతిపరుల్ని అవకాశం దొరికినప్పుడల్లా నిర్దాక్షిణ్యంగా మాటల కొరడాతో చావగొడతాయి. అలాగని ఈ రచనల్లో ఎక్కడా సైద్ధాంతిక చర్చలు లేవు. వ్యంగ్యం మితిమీరలేదు. హాస్యం వికటించలేదు; చురకలే గాని వాతల్లేవు. ఈ రచనలన్నీ కూడా ఒక చిరకాల మిత్రురాలు తమతో ప్రత్యక్షంగా సంభాషిస్తున్న అనుభూతిని పాఠకులకు కలిగిస్తాయి. ఇక్కడున్నవన్నీ ఏకపక్ష తీర్మానాలకు, అంతిమ పరిష్కారాలకు దూరంగా నడయాడే ప్రజాస్వామిక ప్రతిపాదనలు.
- ఉణుదుర్తి సుధాకర్
