-
-
సుమతీ శతకం
Sumathi Satakam
Author: Baddena
Publisher: Victory Publishers
Pages: 57Language: Telugu
Description
సిరి దా వచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ సలిలము భంగిన్
సిరి దాఁ బోయిన బోవును
కరిమింగిన వెలగపండు కరణిని సుమతీ!
తాత్పర్యము: సుమతీ! సంపదలు ఎప్పుడునూ, కొబ్బరికాయలోనికి నీరు ఏ విధముగా వచ్చునో, ఆ విధముగానే తెలియకుండా వచ్చుచూ ఉండును. ఏనుగు మ్రింగిన వెలగపండులోని గుజ్జు ఎవరికిని తెలియకుండా ఏ విధముగా మాయమగునో అట్లే సంపదలు ఎవరికిని తెలియకుండా మాయమగునని భావము.
* * *
పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడు పుట్టదు, జనులా
పుత్రుని కనుగొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!
తాత్పర్యము: సుమతీ! తండ్రికి కొడుకు పుట్టిన తోడనే సంతోషము కలుగదు. జనులు ఆ కొడుకును చూచి పొగుడుచున్నప్పుడు, కీర్తిగన్నప్పుడు సంతోషము పుట్టును.
Preview download free pdf of this Telugu book is available at Sumathi Satakam
Mana sampradayani velugu tise padyamulu ante naku chala estam