-
-
సులభ ప్రశ్నజ్యోతిషము
Sulabha Prasna Jyotishamu
Author: P M Gopalachary
Pages: 274Language: Telugu
జ్యోతిష్య శాస్త్రములో పలు శాఖలు ఉన్నాయి. వాటిలో హారరీ astrology (ప్రశ్న జ్యోతిషం) అనేది ఒకటి. అన్నింటిలోకి ముఖ్యమైనది. మేలైనది. నిర్ణయంలో దీనిని మించినది లేదు. వ్యక్తి జాతకంలో నిర్ణయము సందేహాస్పదమైనపుడు ఈ విధానం ఎంతగానో తోడ్పడుతుంది. జాతకం లేని వారికి భవిష్యత్తు నిర్ణయంలో ప్రయోజనాన్ని అందించే మంచి సాధనం. అనుకున్న పని లేదా విషయము జరిగేదీ లేనిదీ ఎప్పుడు జరిగేది ఎంత మోతాదులో జరిగేది ఎవరి తోడ్పాటుతో జరిగేది అనే విషయాలన్నింటినీ ఈ ప్రశ్న జ్యోతిష్యము ఖచ్చితంగా నిర్ద్వంద్వంగా సూటిగా తెలియ వీలు కల్పిస్తుంది. ఎన్నో శతాబ్దాలుగా ఎన్నో రీతులలో ఇది వృద్ధి చెందుతూ వస్తూ ఉంది. పూలు పండ్లు ఆకులు గవ్వలు వీటి ఆధారంగా జ్యోతిష్కులు ఫలితాన్ని చెప్తూ వచ్చేవారు. అదేవిధంగా జ్యోతిషశాస్త్రంలో నవాంశలు 108. కాబట్టి 108 లోగా ఒక సంఖ్యను ఎన్నుకొని దాని ఆధారంగా జాతక చక్రం తయారుచేసి ఫలితాలు చెప్పడం కూడా ఒక విధానంగా ఉంటూ వచ్చింది. లగ్నం, ఆరూఢ లగ్నం, త్రిస్ఫుటం, అష్ట మంగళం మొదలగు వాటి ఆధారంగా కూడా ప్రశ్న జ్యోతిష్యం ఆచరణలోనికి వస్తూ ఉండినది. ప్రశ్న మార్గ, ప్రశ్న తంత్రం కేరళీయ విద్య ఇత్యాది గ్రంథాలలో ఈ విషయాలు విపులంగా చేర్చబడి ఉన్నాయి. వీటిని ఇప్పుడు మనం ప్రక్కన పెట్టి కృష్ణమూర్తి పద్ధతి గురించి చర్చిస్తాము. ఈ పద్ధతి ద్వారా నూటికి నూరు పాళ్ళు ఫలితం ఖచ్చితంగా వీలవుతుంది.
- పబ్లిషర్స్
