• Suguna Satakam
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సుగుణ శతకము

    Suguna Satakam

    Publisher: Victory Publishers

    Pages: 54
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రాచీన కవులెందరో వ్రాసిన శతకాలెన్ని వున్నా, వేమన శతకంలోని పద్యాలు పండితులనే కాక పామరులను కూడా అలరించినవనడంలో అతిశయోక్తి లేదు. అక్షరజ్ఞానం లేని తెలుగు వారి నాలుకలపై కూడా నేటికీ నాట్యమాడుతున్నాయి వేమన పద్యాలు. ఈ ప్రాచుర్యానికొక కారణం వేమన సరళమైన తెలుగు భాషనాశ్రయించడమని భావిస్తాను. అందుకే పబ్బోజు నరసింహాచారి రచించిన ఈ శతకంలోని పద్యాలు నాకు బాగా నచ్చాయి. హృద్యహృద్యమంగా సాగిన ఈ పద్య కుసుమాల నాఘ్రాణించి, భావ పరిమళమునాస్వాదించాను.

ఈ శతకంలోని పద్యాలన్ని ఆణిముత్యాలే! నా ఆశీస్సులు కోరుతూ ఈ శతకము గురించి వ్రాసిమ్మన్నాడు. పద్యాలన్ని చదివింతర్వాత అనిపించింది, పబ్బోజు నరసింహాచారి ఆశీస్సులకే కాదు నా అభినందనలకు కూడా పాత్రుడేనని!

- డా॥ పండిట్‌ మల్లాది మణి

* * *

ఈ శతకములో కవిగారు ఈ సామాజిక స్పృహను చిత్రీకరిస్తూ పలు అంశాలను పేర్కొన్నారు. బంధువుల చెలిమి గురించి, ఖలుని ప్రవృత్తి గురించి, గుట్కా, జూదం వ్యసనాల గురించి, మతము, మాత, మాతృభాష, ఆశ, అడియాస, వాస్తు, తరులు మొదలగువానిని సోదాహరణముగా, మదికి హత్తుకునే విధముగా తెలిపినారు.

పాలుకురికి సోమన్న వృషాధిప శతకం నుండి నేటి పబ్బోజు నరసింహాచార్యుల ''సుగుణ శతకము'' వరకు అవిచ్ఛిన్నములుగా, శర పరంపరలుగా శతకరచనలు వెలువడుచూ తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేయుచునేయున్నవి. ప్రజల నాల్కలపై నేటికిని నిలిచినవి శతకపద్యాలే మరి. ఈ కవి ఇంకను కృషి చేసి, మరిన్ని కృతులను సంతరించి, వాణి సేవలో ధన్యుడు కావాలని కోరుతూ...

- తల్లోజు యాదవాచార్యులు

Preview download free pdf of this Telugu book is available at Suguna Satakam