-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
సుడిగుండాలు (రాయలసీమ ముఠాకక్షల కథ) (free)
Sudigundalu - free
Author: T. Malla Reddy (Surya)
Pages: 82Language: Telugu
నా ముఖ్య అభిమానుల్లో ఒకరైన సూర్య, రాయలసీమ కక్ష్యలు కార్పణ్యాలను గురించి ఈ చిన్న పుస్తకంలో ఒక చక్కని కథ రాశాడు.
ఇందులోని కొత్తపల్లె, పెద్దపల్లెలలోని కక్షలు ఎంతమంది అమాయకుల ప్రాణాలను బలిగొన్నాయో పాఠకుని మనస్సు చలించేటట్లు చూపించాడు. పగ, ప్రతీకారం అను సుడిగుండంలో చిక్కిన ఈ పల్లెలు రెండూ తుదకు ఎలా బయటపడ్డాయో, కథ సుఖాంతం అయిన తీరు తెలుపుతుంది. కథానాయకుదు రాము పాత్రను మలచిన తీరు ఈ కథకు ప్రాణం. రాయలసీమ కక్షల గురించి సంపూర్ణ అవగాహన ఉన్న రచయిత ఈ కథలోని పాత్రలను, సందర్భాలను సజీవంగా వుండునట్లు జాగ్రత్తపడ్డాడు. ఈ కారణం వల్లనూ, భాష సరళంగా వుండడం వల్లనూ పాఠకుని, తుదివరకు ఏకబిగిన చదివేటట్లు ఈ కథ కట్టివేస్తుంది. ఒక సందర్భంలో కథానాయకుడైన రాము కక్షల పర్యవసానాలతో విసుగు చెంది తన న్యాయవాద వృత్తికి స్వస్తి చెప్పగా, ఆయనగారి సతీమణి నీరజ సమయస్ఫూర్తిని, పరిణతిని ప్రదర్శించి, దాన్ని ఉపసంహరింపజేసిన తీరు కథకు హైలైట్గా చెప్పవచ్చు. కక్షలు సద్దుమణిగిన తర్వాత కొత్తగా నిర్మించిన మైలవరం రిజర్వాయరు పెద్దపల్లె ప్రజల్లో గొప్పగా మార్పు తెచ్చింది. ఆ నీళ్ళతో పెద్దపల్లె రైతులు రెండు కార్లు పండించుకొంటూ సుఖమయ జీవితానికి అలవాటు పడ్డారు. వారి తిరిగి కక్షల జోలికి పోరుగాక పోరు.
కక్షలు, కార్పణ్యాలు ఫ్యూడల్ సంస్కృతిలో ఒక భాగం. ఇప్పుడు ఆ సంస్కృతి కనుమరుగైంది. కక్షలకు నాయకులైన వారి కుటుంబాల పిల్లలు ఉన్నత విద్య, ఉన్నత ఉద్యోగాల వేటలో పరుగులు తీస్తున్నారు. భారీ సంఖ్యలో రాయలసీమ నుండి అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక నూతన సంస్కృతి చోటు చేసుకోవటం స్వాగతించదగిన పరిణామం.
రచయితకిది రెండవ ప్రచురణ. "ఒక మానసిక వ్యాధిగ్రస్తుని ఆత్మకథ" పేరుతో గతంలో ఒక పుస్తకం వెలువరించారు. రచనావ్యాసంగంలో ఒక చేయి తిరిగిన రచయితగా తెరమీదకి వస్తున్నాడు. ఆయన కలం నుంచి మరిన్ని రచనలు
జాలువారగలవని ఆశిద్దాం.
- నర్రెడ్డి శివరామిరెడ్డి, మాజీ శాసనసభ్యులు

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- ₹129.6