-
-
సుధన్వా సంకీర్తనం
Sudhanva Sankeertanam
Author: Bijibilla Lakshmi Valli Devi
Publisher: Self Published on Kinige
Pages: 192Language: Telugu
"భక్తిరేవగరీయసీ" – అన్నారు ప్రాజ్ఞులు. భగవంతునికంటె భగవద్భక్తులే శ్రేష్టులని నిరూపింపబడిన ఘట్టాలకు మన పురాణాలలో కొదువ లేదు. భగవంతుడు భగవద్భక్తుల సంకీర్తనలలో కొలువై ఉంటాడని నారద ఉవాచ. ఈ యన్నివిషయాలనూ ఆకళింపుచేసుకున్న మహిళామణి శ్రీమతి బిజిబిళ్ళ లక్ష్మీవల్లీ దేవిగారని నా అభిప్రాయము.
కాబట్టే త్యాగయ్య, అన్నమయ్య, పురందరదాసు, రామదాసు వంటి భక్తిశిఖామణుల సంకీర్తనల కేమాత్రము తీసిపోని విధంగా తమ "సుధన్వా సంకీర్తనం" సాగించారనటం ఏమాత్రం అతిశయోక్తి కాదేమో. ప్రతికీర్తన ఒకరస గుళక.
నా పూర్వజన్మ పుణ్యఫలాన నేను ప్రస్తుత కవయిత్రి తండ్రిగారైన "బ్రహ్మశ్రీ రవిపాటి బాలగురునాధశర్మగారి" కొన్ని పరమార్ధక వ్యాసాలను చదవటం తటస్థించింది. అలాంటి మహనీయుని పుత్రికకు భక్తిరస భావబంధురమైన కవిత ప్రాప్తించటం ఆశ్చర్యమేమీ కాదు. పైగా అది సహజం కూడా.
"సుధన్వా సంకీర్తనం" - అనే ఈ మధుర భక్తిరస కావ్యం మధురాతి మధురమైన కీర్తనలలో నిండి ఉంది. "పోతన్న తెల్గుల పుణ్యపేటి" అని విశ్వనాథ సత్యనారాయణగారు పోతన కవిత్వాన్ని మెచ్చుకున్నారు. శ్రీమతి లక్ష్మీవల్లీదేవిగారు కూడా పోతన మహాకవికి ఏమాత్రం తీసిపోని విధంగా భక్తిరస మాధుర్యంతో తమ కీర్తనలను నింపివేశారు. వారికి నా మనఃపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
- డా. పోతుకూచి ఉమాభట్టీశ్వర శర్మ
