-
-
సక్సెస్ సీక్రెట్స్
Success Secrets
Author: Saili
Publisher: Victory Publishers
Pages: 71Language: Telugu
ప్రతి వ్యక్తిలోను అంతర్గత శక్తులు ఉంటాయి. వాటిని గుర్తించి చైతన్యం కల్గించగల్గితే విజయం మీచెంత ఉంటుంది. ప్రతి వ్యక్తి పాటించాల్సిన నియమాలు ఏమిటో తెలుసుకుందాం.
* మీలోని నాయకత్వ లక్షణాలు, బలాలు మీరు గుర్తించుకోవడం మీరు తీసుకోవాల్సిన మొదటి చర్య.
* ఆత్మీయతతో కూడిన మన మాటలు ఇతరులకు ప్రేరణ కల్గిస్తాయి.
* ఎవరినైనా ప్రేరేపణ చెందించాలంటే వారి పేరును వినియోగించుకుంటే పని సులువుగా సానుకూలం అవుతుంది.
* ఇతరుల అభివృద్ధిలో చిత్తశుద్ధితో కూడిన శ్రద్ధ కల్గి వుంటే మీరు చేసే పనులు చాలా ప్రభావం చూపుతాయి. ఫలవంతం అవుతాయి.
* ఇతరుల దృక్కోణంతో మీరు చూడగల్గాలి.
* ఇతరులు చెప్పేది వినడం బాగా అలవరుచుకోవాలి.
* రేపటి పనులకు మనుషుల్ని తయారు చేసుకోవాలి.
* ఇతరుల మనోభావాల్ని గౌరవించాలి.
* డబ్బు ధ్యేయంగా మనిషి పనిచేస్తున్నా అభినందన మనిషిలో పనిపట్ల మరింత అంకిత భావాన్ని కలుగచేస్తుంది.
* ఎదుటి వారిలో తప్పులు వెతికే ప్రయత్నం కూడా చేయవద్దు. మీ తప్పులు మీ తప్పులు మీరు ఒప్పుకోండి సృజనాత్మకంగా వుండండి.
* స్పష్టమైన, సాధించగల లక్ష్యాలను ఎన్నుకోవాలి.
* విజేతలు ఎప్పుడూ తమ దృష్టిని లక్ష్యం మీదనే కేంద్రీకరిస్తారు.
* విశ్రాంతి మనిషి పని నాణ్యతను పెంచుతుంది.
* అనుకూలంగా ఆలోచిస్తూ బలాన్ని పుంజుకోవాలి. ప్రతికూలంగా ఆలోచించి ఉన్న బలాన్ని కోల్పోకూడదు.
* మీ ఆందోళనలను మచ్చిక చేసుకుని జీవితానికి కావలసిని శక్తిని పొందాలి.
* ఉత్సాహం యొక్క పవర్ని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయవద్దు.
