• Subrahmanya Bharati
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సుబ్రహ్మణ్య భారతి

    Subrahmanya Bharati

    Pages: 47
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తమిళభాషలో ఆధునిక వచనవికాసం 18న శతాబ్దారంభం నుంచీ కలిగింది. సుబ్రహ్మణ్యభారతి గొప్ప దేశభక్తుడు; సంఘకర్త. సమాజాభివృద్ధి కోసం తన బ్రతుకునే మీదు కట్టుకున్నవాడు. వచనరచలను సులభగ్రాహ్యాలుగాను, మనస్సుకు హత్తుకొనే రీతిలోనూ, భారతి రచించాడు.

ప్రాధాన్యత గల వచన రచనలు చేసినా, ఇప్పటి వరకూ ఆంగ్లం ద్వారా గానీ, సోదర భాషల ద్వారా గానీ భారతి కవితలకే ప్రచారం కలిగించబడింది. ఆయన కవితల గురించే పరిశీలనా వ్యాసాలు వ్రాయబడ్డాయి. ఇట్టి పరిస్థితిలో, నేషనల్‌ బుక్‌ ట్రస్టు వారు, తమిళ భాషలో నిష్ణాతులైన ఆచార్య చల్లా రాధాకృష్ణ శర్మను నియమించి, తెలుగులో భారతి వచన రచనలను అనువదింపచేయడం అదృష్టమే. నూట ఏభై పుటల ఆ గ్రంథం భారతి సాహిత్యాన్ని అధ్యయనం చేయతలచిన వారికి విందు చేస్తుంది.

ప్రతి అక్షరంలోనూ భారతి దేశ భక్త హృదయం విస్పష్టంగా దర్శనమిస్తుంది. సమాజాన్ని సంస్కరించాలనే ఆర్తి ప్రతి అక్షరంలోనూ ఆర్థ్రంగా నిలుస్తుంది.

సుబ్రహ్మణ్య భారతి సామాన్య జనంలో సామాన్యుడిగా కలసిపోయినవాడు. రైతులతోనూ, కూలీలతోనూ శ్రామిక జనులందరితోనూ భుజాలు రాసుకుంటూ మసలినవాడు. ఆయన కథలు చదివితే-సామాజికుల సంవేదనలు ఎంత విస్పష్టంగా రూపుతొడుక్కున్నాయో ద్యోతకమవుతుంది.

మహాకవి సుబ్రహ్మణ్య భారతి రచనలలో సామాజిక వాస్తవికత రుచివంతంగా చిత్రించబడింది. సాధారణ వ్యాసంలో సైతం కళామయ స్పృహ ఆయత్తమైంది. జీవితం జీవనీయమేనన్న పవిత్ర సందేశం అక్షరాక్షరరంలోనూ తళతళలాడుతుంది. కులాల మెట్లు కట్టుకున్న హైందవ సమాజం పునాది లేని భవనంలా ఎలా కూలిపోనున్నదో డెభ్భై ఏళ్ళ క్రితమే భారతి చిత్రించగలగడం మనకు ఆశ్చర్యం కలుగుతుంది. మతాల అడ్డు గోడలతో గాలీ వెలుతురూ సోకక ఎలా కృశించి పోతున్నదో చూసి ఆయన ఎంతగానో ఆక్రోశించాడు! అందుకే భారతి వచన రచనా శక్తికి మరణం లేదు. కాలం ఎగజిమ్మిన దుమ్మూ ధూళీ దానికంటవు.

- డా. ఆవంత్స సోమసుందర్‌

Preview download free pdf of this Telugu book is available at Subrahmanya Bharati