-
-
స్త్రీల సమస్యలు - సందేహాలు పరిష్కార మార్గాలు
Streela Samasyalu Sandehalu Parishkara Margalu
Author: D. V. Suryakumari
Publisher: Sree Madhulatha Publications
Pages: 88Language: Telugu
ఇంటికి దీపం ఇల్లాలు అనే పెద్దల మాటల్లో ఎంతో వాస్తవం ఇమిడివుంది. ఆ ఇంటి ఇల్లాలు ఎప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా వుంటుంటే...ఆ కుటుంబం మొత్తం సుఖ-సంతోషాలతో కళకళలాడుతుంది.
కానీ, జీవితమన్న తర్వాత కొన్ని సమస్యలు ఎదురవ్వడం, కొన్ని సందేహాలు కలవరపర్చడం సహజంగా జరుగుతుంటాయి.
కొంతమంది స్త్రీలు...చాలా చిన్న చిన్న సమస్యలకు కూడా ఎక్కువగా స్పందిస్తారు. దీనికి కారణం...వాళ్ళలో ఆయావిషయాలపై అవగాహన తక్కువవడం వలన ఆందోళన ఎక్కువగా వుంటుంది.
అలాగే వయసులను బట్టి, ఎదుగుదలను బట్టి, శారీరక మార్పులను బట్టి కూడా ఎన్నో సందేహాలు వాళ్ళలో మానసికంగా ఆందోళన కలిగిస్తుంటాయి. వాటిని తగిన అవగాహనతో నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి తప్పితే సందేహాలను మదిలో నింపుకోకూడదు.
ఈ సమస్యలు-సందేహాలన్నీ కూడా మానసిక ఒత్తినీ, ఆందోళనలను పెంచుతూ ఎన్నోరకాల అనారోగ్యాలకు గురిచేస్తున్నాయి. స్త్రీలు సున్నితమనస్కులు. మానసిక ఒత్తి, ఆందోళనలు వీరిమీద ఎక్కువగా వాటి దుష్ప్రభావాన్ని చూపుతాయి.
కాబట్టి... స్త్రీలు వారి జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాల మీద ఎంతో అవగాహన పెంచుకుంటూ విజ్ఞానవంతులు కావాలి.
