-
-
స్త్రీ విజయం వెనుక పురుషుడు - రివైజ్డ్
Stree Vijayam Venuka Purushudu Revised
Author: Suryadevara Rammohana Rao
Pages: 267Language: Telugu
సహజంగానే పార్టీలు మీటింగులు అంటే ఎం.ఎల్.ఎ. నిరంజన్‌కు ఇష్టం వుండదు. అయినా తన తండ్రి మధుసూధన్‌రెడ్డి ప్రోద్బలం గాబట్టి ఆయనతో వెళ్ళక తప్పలేదు. అదీ టైగర్ యుగంధర్ తో సమావేశం అంటే మాటలుకాదు. అక్కడ ఆయన తననో చిన్న పిల్లాడ్ని చూసినట్లు చూడ్డం నిరంజన్‌కి అస్సలు నచ్చలేదు..
రాష్ట్ర రాజకీయ వర్గంలోనూ, ప్రజల్లోను కూడా ఎమ్మెల్యేగా తనకి మంచి పేరు వుంది. కాని వాళ్ళకి అది అక్కర్లేదు. మీటింగ్ చాలాసేపు నడిచింది. తను మాట్లాడింది తక్కువే..
అసలు మాట్లాడనిస్తేగా. సింహాల మధ్యన మేకపిల్లలా అయింది అక్కడ తన పరిస్థితి. మీటింగ్ మధ్యలోనే తనకి చేతుల ఒణుకు ఆరంభమైంది. ఎవరూ గమనించకుండా చాలా జాగ్రత్తపడ్డాడు.
ఎలాగో మీటింగ్ ముగించుకుని బయటపడేసరికి చాలురా బాబు అన్పించింది. ప్రాణానికి చాలా హాయిఅన్పించింది. అసలు తనను సి.యం.ను చేయటం తన తండ్రికి ఇంత పట్టుదల ఏమిటో అర్థంకాదు. ఒకవేళ ఆయన ప్లాన్ ప్రకారమే రేపు తను సి.యం. అయినా రిమోట్ వాళ్ళ చేతుల్లోనే వుంటుంది. తనను ఉత్సవ విగ్రహంలా వుంచి ఆడిస్తారు.
ప్రజలకు మంచి చేయాలని తనకి వున్నా వాళ్ళు చేయనివ్వరు. సహకరించరు. పక్కా కమర్షియల్ మనుషులు వాళ్ళు. అందుకే ఏదో ఫార్మాలిటీగా తండ్రివెంట వెళ్ళాడేగాని ఈ విషయంగా అతడితో ఫ్రస్టేషన్ స్టార్టయి చాలాకాలమైంది.
ఆ కోపంలోనే ఎవరూ చూడకుండా ఒంటరిగా వీధిలోకొచ్చేసాడు. అంతక్రితమే వీధిలైట్లు వెలిగాయి. చినుకుచినుకు వర్షం పడుతోంది. వెంట సెక్యూరిటీ, మెషిన్‌గన్స్ హడావుడీ లేకుండా నడుస్తున్న అతన్ని ఎవరూ గుర్తుపట్టలేదు.
అవును. కార్లు, బార్లు, గన్మెన్ల వలయం, పార్టీ కార్యకర్తల హడావుడి వుంటేగాని జనం రాజకీయనాయకుల్ని గుర్తించలేక పోతున్నారు. తనలో తను చిన్నగా నవ్వుకున్నాడు.
ఉన్నట్టుండి మళ్ళీ చేతులు ఒణకటం ఆరంభించాయి.
ఇక లాభంలేదని పక్కనే వున్న కాయిన్ బాక్స్ వద్దకెళ్ళి ఒక రూపాయి కాయిన్ వేసి ఒక నంబర్ కి డయల్ చేసాడు. అవతల ఎవరో ఫోన్‌లిఫ్ట్ చేసారు.
'నేను ఎమ్మెల్యే నిరంజన్ మాట్లాడుతున్నాను. మేనేజర్ని పిలు” చెప్పాడు. క్షణం తర్వాత మేనేజర్ లైన్లోకొచ్చాడు.
“నేను వస్తున్నాను” సింపుల్‌గా ఒకేమాట చెప్పి ఫోన్ పెట్టేసాడు నిరంజన్. వెంటనే అటుగా వస్తున్న ఆటో ఆపి ఎక్కి అబిడ్స్‌లోని ఒక హోటల్ పేరు చెప్పాడు. ఆటో కదిలింది.
ఇప్పుడు నిరంజన్ వెళుతున్న చోటు అక్కడ జరిగే చీకటి కార్యకలాపాల గురించి ఏ టీ వీ ఛానల్ వాళ్ళు లేదా పత్రికా విలేఖర్లు అతడ్ని గమనించి ఫోలో అయినా ఉదయంకంతా అదో సెన్సేషనల్ న్యూస్ అయిపోతుంది.
బట్-మీడియాలో అందరికీ నిరంజన్ అంటే మంచి గౌరవం. ఇంతవరకు బయటకు తెలిసి అతగాడిమీద బేడ్ రిమార్క్స్ లేవు. ఆటో డ్రయివర్‌కి మాత్రమే డౌటుకొట్టింది.
ఇతన్ని ఎక్కడో చూసాను. ఎక్కడ? ఫోటోలోనా నిజంగానే ఎక్కడన్నా చూసాడా? తీవ్రంగా ఆలోచిస్తూనే ఆటో నడుపుతున్నాడుగాని ఖచ్చితంగా గుర్తుపట్టడం సాధ్యంకాలేదు. ఆటో వేగంగా అబిడ్స్ దిశగా పరుగుతీస్తూనేవుంది. అదే సమయంలో సన్నగా వర్షం జల్లు కూడా పెరిగింది.
Average.
Just time pass