• Stree Vijayam Venuka Purushudu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    180
    66.67% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • స్త్రీ విజయం వెనుక పురుషుడు

    Stree Vijayam Venuka Purushudu

    Pages: 200
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సోమాజిగూడ రోడ్‌లో వుంది మిడాన్ గ్రూపు కార్పోరేట్ ఆఫీసు. ఎగ్జిక్యూటివ్ లిఫ్ట్‌లో వెళుతున్న రోషిణిలో ఏదో తెలియని ఉత్సుకత, భావోద్వేగం.

నాలుగేళ్ళ తర్వాత తిరిగి ఆఫీసు మెట్లెక్కుతోంది.

అదే ఆఫీసుకి ఓ రోజు తండ్రి తనను పిలిపించి అభినందిస్తాడని ఎంతో ఆశగా ఎదురుచూసింది. చివరకు ఆయనే వెళ్ళిపోయారు. చివరి చూపు కూడా దక్కలేదు. తను చూపిన పట్టుదలకి, అహంకారానికి ఆయన చాలా పెద్ద శిక్షే విధించాడు. తండ్రి గుర్తుకురాగానే ఆమె కళ్ళలో నీళ్ళు నిలిచాయి.

బ్లాక్ ప్యాంట్ పైన వైట్ షర్ట్, ఆ షర్టుపైన బ్లాక్ కోటు, కాళ్ళకి హైహీల్స్‌తో కార్పోరేట్ లుక్‌తో లేడీ అమితాబ్‌లా ఎంతో ఆకర్షణీయంగా వుంది రోషిణి.

అప్పట్లో ఒకే అంతస్థు కలిగిన ఈ ఆఫీసు కట్టడం ఈ రోజు ఆరు అంతస్థులులతో అధునాతనంగా, ఆకర్షణీయంగా వెలుగుతోందీ అంటే దీని వెనక తన తండ్రి కృషి, పట్టుదల ఎంతో తనకు తెలుసు. అటువంటి తండ్రికి తను కూతురు అని తలచుకుంటేనే ఆమెకు చాలా గర్వంగా అన్పిస్తుంది..

లిఫ్ట్ ఆరో అంతస్థుకు చేరుకునే సరికి -

అక్కడ కంపెనీ సి. ఒ. ఒ. రవీందర్ రెడీగా నిలబడి వెయిట్ చేస్తున్నాడు ఆమెని రిసీవ్ చేసుకోడానికి.

Preview download free pdf of this Telugu book is available at Stree Vijayam Venuka Purushudu