• Stotra Darshanam Revised
  • Ebook Hide Help
    ₹ 120 for 30 days
    ₹ 450
    500
    10% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • స్తోత్ర దర్శనమ్ - రివైజ్డ్

    Stotra Darshanam Revised

    Author:

    Publisher: Marumamula Rukmini

    Pages: 612
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'కలౌ నామ సంకీర్తనమ్' అంటే కలియుగంలో జప, తప, హెూమాదుల కన్నా నామసంకీర్తనకే ప్రాధాన్యమెక్కువ. అది సంకీర్తన రూపంలో కావచ్చు. లేదా స్తుతి/ స్తోత్ర రూపంలోనైనా కావచ్చు.

"మోక్షసాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసీ” కనుక ముక్తి మార్గాన్నే అనుసరించే సాధకులకు కలియుగంలో భక్తిమార్గమే ప్రధానం. ఆర్షభూమి భారతావనిలో ఉపాసకులు, తపస్సిద్ధులైన మహాత్ములు, ఋషులు, సత్కవీశ్వరులు, జగద్గురువులువంటి వారెందరో తమ ఆరాధ్యదైవాలను స్తోత్రం చేసి ప్రసన్నం చేసుకున్నారు. అందుకనే తమ ఇష్టదైవాలను స్తుతులరూపంలో, స్తోత్ర రూపంలో తలచుకోవడమనేది ఎంతో అవసరమైన విషయం. దీన్ని దృష్టిలో పెట్టుకొని దర్శనమ్' ఆధ్యాత్మిక వార్తాపత్రిక తొలి ముద్రణలో మా నాన్నగారు కీ.శే. మరుమాముల రాజమౌళిశర్మగారి స్మృతిచిహ్నంగా 181 స్తోత్రాలతో 352 పేజీలతో అపురూప పుస్తకం 'స్తోత్ర దర్శనమ్' అందించాం.

ప్రచురించిన సంవత్సర కాలంలోనే తొలి ప్రతులన్నీ అయిపోవడం వల్ల ఎక్కడికి వెళ్ళినా “స్తోత్రదర్శనమ్” కావాలన్న జిజ్ఞాసువులైన పాఠకుల కోరిక మేరకు మీ కరకమలాలను అలంకరించిన "స్తోత్ర దర్శనమ్” పరివర్ధిత ముద్రణము వివిధ దేవతల స్తోత్రాల వర్గీకరణతో అందంగా ఆకర్షణీయంగా 304 స్తోత్రాలతో 608 పేజీలతో మలిముద్రణ అందిస్తున్నాం. 'దర్శనమ్' ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక ప్రతీ సంచికను ఆదరిస్తూ, అభిమానిస్తున్న పాఠకదేవుళ్ళకు ఈ “స్తోత్ర దర్శనమ్” కూడా అలరిస్తుందని, ఎప్పటిలాగే మా ముద్రణాలను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాం.

గత 16 సంవత్సరాలుగా సుపరిచితమై, మీ కరకమలాలలో వెలుగులీనుతున్న 'దర్శనమ్' ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక ప్రతీ సంచికలో ఒక స్తోత్రాన్ని అందించడం ఆనవాయితీగా పెట్టుకొంది. ఎంతోమంది పాఠకులు వివిధ సంచికలలోని అరుదైన స్తోత్రాలను దాచుకొని పారాయణం చేస్తున్నామని తెలపడం మాకెంతో సంతోషాన్నిచ్చింది.

మహాత్ములు, జగద్గురువులే కాక అజ్ఞాతకవులు, కాళీదాసాది ప్రాచీనకవుల, ఆధునిక మహాకవుల స్తోత్రాలన్నీ ఆదర్శనీయంగా 'స్తోత్ర దర్శనమ్' సంకలనంగా “దర్శనమ్' ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక మీ ముందుకు తెస్తోంది.

- మరుమాముల వేంకటరమణశర్మ

Preview download free pdf of this Telugu book is available at Stotra Darshanam Revised