-
-
స్త్రీపర్వం
Sthreeparvam
Author: Simha Prasad
Publisher: Sri Sri Prachuranalu
Pages: 145Language: Telugu
“అబ్బాయ్! ఏం చేస్తున్నావురా” ఫోన్లో తండ్రి గొంతు ఖంగుమంది.
“ఇప్పుడే ఆఫీసునుంచొచ్చాను” అన్నాడు జయంత్.
“అడ్డమైన తిరుగుళ్ళూ తిరక్కు....”
తండ్రి మాటల్ని కట్ చేయడానికి, “అమ్మకెలా వుంది నాన్నా” అనడిగాడు.
“అలాగే వుందిరా. రాణింపు కన్పించట్లేదు. ఏం రోగమూ ఏంటో అంతు బట్టడం లేదనుకో....”
“సిటీకి తీసుకురండి అన్ని టెస్టులూ చేయిస్తాను....” ఆదుర్దాపడ్డాడు.
తల్లి ఫోన్ అందుకొని, “సూర్యం డాక్టరు మందులిస్తున్నాళ్ళేరా. నీ పెళ్ళి చూసేదాకా నాకేం కాదు గాని నీకు హైదరాబాదు నుంచి రాజా లాంటి సంబంధం వచ్చిందిరా. కోట్ల ఆస్తి ఒక్కతే పిల్ల” అంది సంబంరంగా.
సడన్గా జయంత్ మెదడు మొద్దుబారినట్టు అయిపోయింది.
“అమ్మాయి ఫోటో చూశాంరా. ఒంటినిండా నగల్తో లక్ష్మీదేవిలో మెరిసిపోతుందనుకో. చూస్తే నువ్వూ తలూపేస్తావులే... మాట్లాడవేంరా అబ్బాయ్”
* * *
విఖ్యాత రచయిత స్పందన / కితాబు
ఇప్పుడే మీ నవల ‘స్త్రీపర్వం’ కన్నీళ్ళతో పూర్తి చేశాను. అద్భుతమైన రచన. స్క్రీన్ప్లే, పాత్ర చిత్రణ, డ్రామా ఫెర్ఫెక్ట్గా ఉన్నాయి. నా నవల ‘ఆనందోబ్రహ్మ’ను గుర్తుచేసుకున్నాను. గొప్ప రచన. అభినందనలు.- యండమూరి వీరేంద్రనాథ్
