-
-
స్త్రీ
Sthree
Author: Ranganayakamma
Publisher: Sweet Home Publications
Language: Telugu
ఈ నవల రచనాకాలం 1965. ఈ నవల మొదట 'ఆంధ్రప్రభ' వార పత్రికలో 1965లో సీరియల్‌గా వచ్చింది. తర్వాత పుస్తకంగా - 1966 అక్టోబర్, 1968 డిసెంబర్, 1970 అక్టోబర్, 1975 ఆగస్టు, 1980 ఫిబ్రవరి, 1985 ఫిబ్రవరి, 1996 సెప్టెంబర్, 2003 జనవరి, 2009జనవరిలో - మొత్తం 9 ముద్రణలు వచ్చింది.
సాంప్రదాయాలంటే పడి చచ్చే కుటుంబాల్లో పిల్లలకు, కులాంతర, మతాంతర వివాహాలు చేసుకోడం పెద్ద సమస్యే. ఈ నవలలోని ఇతివృత్తం ఇదే.
కుల మత భేదాలని లక్ష్యపెట్టకుండా నిలబడడం అంటే, పెద్ద వాళ్ళ దయా ధర్మాల కోసమూ, వాళ్ళ అనుమతుల కోసమూ, ఎదురుచూడడం కాదు.
కథావస్తువులో 'అభివృద్ధి నిరోధకమైన' అంశాలేమీ లేవు. ప్రధాన పాత్రలు 'ఆదర్శవంతంగానే' ఉన్నాయి. పద్మజ అభ్యుదయ భావాలతో ప్రవర్తించింది. పార్వతి కూడా కథ పొడుగునా సంస్కారం తోటీ, ఆత్మగౌరవం తోటీ ప్రవర్తించింది.
ఆసక్తికరంగా సాగిపోయే ఈ నవల డిజిటల్ రూపంలో ఇప్పుడు మీ ముందుకు వచ్చింది.
