• Step
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    120
    50% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • స్టెప్

    Step

    Author:

    Pages: 112
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

''అనూప్! నువ్వొకసారి మన బ్యాంక్ జనరల్ మేనేజర్ అగ్నిహోత్రిని కలవడం మంచిది. బ్యాంక్ అవసరాలకు సరిపోయే కంప్యూటర్ల నమూనా, సెక్యూరిటీ సెటప్ అంతా ఆయన్నీకు వివరిస్తాడు'' అంటూ కొన్ని బ్లూ ప్రింట్లను అందించాడు రెడ్డి.

''రేపు ఉదయం సరిగ్గా పదకొండు గంటలకు డాల్ఫిన్ హోటల్‍ కొచ్చేయ్ అనూప్! అక్కడే అగ్నిహోత్రిని కలుద్దాం. ఈలోపుగా నీకిచ్చిన బ్లూ ప్రింట్లను స్టడీ చేయ్! ఓ. కె.'' అంటూ కరచాలనం చేశాడు నాగిరెడ్డి.

''ఓ. కె! సీ యూ టుమారో'' అంటూ బయటకొచ్చాను.

నేను రూమ్‌కు చేరుకోగానే బ్లూప్రింట్స్ ఉన్న పేపర్లను తెరిచి పరిశీలించసాగాను. భాగ్యలక్ష్మి బ్యాంక్‌ను ఎంతో పకడ్బందీగా రూపొందించబోతున్నారనే విషయం వాటిని చూస్తూనే నాకు బోధపడింది. బ్యాంకు కోసం ఏడంస్తుల బిల్డింగ్, సెల్లార్ ఫ్లోర్, ఇంకా అండర్‌గ్రౌండ్ వాల్ట్, సేఫ్ డిపాజిట్ బాక్సులు... ఓహో... ఇదేం మాములు బ్యాంక్ కాదు. ఇలాంటి బ్యాంకు కోసం పనిచేసే ఛాన్స్ జీవితంలో ఒక్కసారే కలుగుతుంది. ఆ బ్లూప్రింట్లను పరిశీలించిన తరువాత ఆ బ్యాంకుకు కావల్సిన అత్యంత ఆధునికమైన కంప్యూటర్లు, ఎలెక్ట్రానిక్ భద్రతా పరికరాల్ని నేను సమకూర్చగలననే నమ్మకం నాకు దృఢంగా కలిగింది. నాకు నా తండ్రి తరచుగా చెబుతుండే మాటలు జ్ఞప్తికొచ్చాయ్.

''పెద్ద మడుగులో చిన్న చేపగా వుండే కంటే, చిన్న మడుగులో పెద్ద చేపగా వుండడం మేలు''. నేనెప్పుడూ ఆయన మాటల గురించి ఆలోచించలేదు కానీ, ఇప్పుడు నాకో సందేహం కలిగింది.

చిన్న మడుగులో పెద్ద చేపలా వుండేకన్నా పెద్ద మడుగులో పెద్ద చేపలా కూడా బతకొచ్చు గదా!

అంతే! ఓ నిర్ణయానికొచ్చాను.

Preview download free pdf of this Telugu book is available at Step