-
-
సృష్టి జనజీవన దర్పణం
Srusti Janajeevana Darpanam
Author: Kekalathuri Krishnaiah
Pages: 288Language: Telugu
విశ్వం ఆవిర్భావం నుంచి జన జీవన పరిణామం శక్తి మేరకు సవివరంగా వివరించదలచాను. ఈ పుస్తకం చదివిన వారికి తృప్తి, సంతోషం కలిగేట్లు చాలా విషయాలు లోతుగా పరిశీలించి వ్రాయడం జరిగింది. ఇందులో సృష్టికాలము, విశ్వాంతరాళం పుట్టుక విజ్ఞానశాస్త్ర ప్రకారము. వేద పురాణాలు ఏమి చెప్పాయి. సృష్టిలోని శక్తులు, యుగాంతం, మానవ పరిణామ దశలు, వివిధ సంస్కృతులు, మతము, వాటి ఆధార గ్రంధాలు, ప్రవక్తలు, వారి కాలము, బోధనలు, పంచభూతాలు, వాటిలో స్థూలశరీరం, తన్మాత్రలనుండి ఇంద్రియములు ఏర్పడిన విధములు, ఆయా మతాల తత్వము, వివిధ మతాల ఆచార వ్యవహారములు, ప్రార్థనలు, పండుగలు మొదలగునవి, ఈ గ్రంధం ముగింపులో మతము ఏదైనా దైవము మీద విశ్వాసం పెంచుకుని, మానవత్వ విలువలు తెలుసుకుని, దైవత్వాన్ని పెంచుకుని, దైవ సన్నిధి చేయడమే ద్వేయము కాబట్టి విశ్వప్రేమ, కర్మసిద్ధాంతం, యుగధర్మం, దాన మహిమగూర్చి తెలుపడం జరిగింది. అదిగాక ముక్తి పదానికి యోగసాధనా మార్గం, వాటి పరిణామాలు గురించి తెలుపడం జరిగింది.
అజ్ఞాని ఆలోచనకు ఉదా: చీకటి పడగానే మినుగురు పురుగులు మినుక్, మినుక్ మెరుస్తూ కనిపిస్తూ, అవి ప్రపంచానికి వెలుగునిస్తున్నాయి అనుకుంటాయి. కొంతసేపటికి నక్షత్రములు వెలుస్తాయి. మినుగురు పురుగులు వెలవెలపోతాయి. నక్షత్రాలు అందరికీ వెలుగునిస్తున్నాయనుకుంటాయి. చంద్రుడు వుదయించేటప్పటికి నక్షత్రాలు వెలవెలపోతాయి. ఉదయం సూర్యుడు వుదయించేటప్పటికి చంద్రుడు వెలవెలపోతాడు. సృష్టిలో దైవం తప్ప ఎవ్వరూ గొప్పవారు కాదు. అహంకారము, స్వార్ధచించన వదలి వారి వారి బాధ్యతలు నెరవెరుస్తూ సృష్టిలో ఏదీ శాశ్వతం కాదని తెలుసుకుని జ్ఞాన సంపన్నులయి ప్రశాంత జీవితం గడపాలి.
ఈ గ్రంథము చదివిన వారికి జ్ఞానార్జనతోపాటు, మత సామరస్యము, విశ్వమానవ ప్రేమ, మానవ విలువలు అర్ధం చేసుకుని మానవులంతా సమానమే అని అర్థం చేసుకుని అవసరమైనప్పుడు వారికి సహాయము సహకారములు అందించి దైవానుగ్రహం పొందగలరని ఆశించుచున్నాను.
- రచయిత

- ₹154.02
- ₹216
- ₹255
- ₹162
- ₹122.4
- ₹181.56