• Srushti Drushti
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సృష్టి - దృష్టి

    Srushti Drushti

    Publisher: Janani Publications

    Pages: 98
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పి. రామకృష్ణ (రామకృష్ణారెడ్డి) గారు కవి కథకుడు నవలా రచయిత. మూడు ప్రక్రియలలోను ఆయన విశిష్టుడు. తెలుగు సాహిత్యంలో నిలిచి పోగలిగిన సృష్టి చేసినవాడు. రచయితలకు ప్రాంతీయ ముద్ర ఉండకూడదు. రామకృష్ణగారు రాయలసీమ రచయిత కాదు. తెలుగు రచయిత. విశిష్ట రచయిత.

రామకృష్ణ గారి 'పెన్నేటి కతలు' ఆయనకు కథా రచయితగా మంచి గుర్తింపు తెచ్చాయి. ఆకథలను నేను చాలా ఆలస్యంగా చదివాను. చదివిన వెంటనే ఆ కథలపై 'ఎర్రి పెన్నేరు' అన్న వ్యాసం వ్రాశాను. కాని ఆ వ్యాసం వెంటనే ప్రచురణ కాలేదు. దాన్ని ఒక చిన్న పుస్తకంగా అచ్చు వేద్దామన్న ఆలోచనతో ఉండగా, ఆయనవి మరికొన్ని కథలను కూడ ఎంపిక చేసి ఆ వ్యాసంతో పాటు వేయాలన్న ఆలోచన కలిగింది. ఆ ఎంపిక చేసిన కథలలో ఒకటి 'దయ్యం!' ఇది 'మనిషీ - పశువు' కథా సంపుటిలోది. ఈ కథను పరిచయం చేస్తూ నేను వ్రాసిన వ్యాసం 'సాక్షి' దినపత్రికలో వచ్చింది. ఆ కథ, వ్యాసము, రెండూ యీ పుస్తకంలో చేర్చాను.

రామకృష్ణగారు అప్పుడప్పుడూ వివిధ పత్రికలకు వ్రాసిన కవితలు యింతవరకు ఒకచోట కనిపించలేదు. అవి ఎక్కువగా లేవు. కాని అవి ఆ కారణంగా కనుమరుగు కానివ్వకూడనివి. అందుకని ఆయన కవితలు మొదటిసారిగా అన్నీ ఒకచోట చేరి కనిపిస్తాయి యిక్కడ. ఈ కవితలలో 'దీపం' సుమారు 35 సంవత్సరాల నుండి నన్ను వదలకుండా మనసులో నిలిచిపోయింది. దానిపై కూడ ఒక చిన్న వ్యాసం వ్రాసి యిందులో చేర్చాను, ఇది యీ పుస్తకావిష్కరణ కారణం.

- సూరపరాజు రాధాకృష్ణమూర్తి

Preview download free pdf of this Telugu book is available at Srushti Drushti