-
-
శృంగారకేళి
Srungarakeli
Author: Dr. Kambhampati Swayamprakash
Publisher: Mohan Publications
Pages: 200Language: Telugu
వైవాహిక జీవితంలో శృంగారం ముఖ్యపాత్ర వహిస్తుంది. శృంగారంలో భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ చాలా ముఖ్యమైనది. ముద్దుముచ్చట, సరససల్లాపాలు అన్నపదాలు తరచూ వింటూఉంటాం. భార్యాభర్తల శృంగార జీవితంలో అనేక విషయాల్లో అనేక సందేహాలు తలెత్తుతూ ఉంటాయి. మంచి శృంగారానికి అవసరమైనవి అనేకం ఉంటాయి. చుంబనాలు (ముద్దు) ఆలింగనం, నఖదంతక్షతాలు, ఔపరిష్టకం, పురుషాయితం(స్త్రీపైన ఉండే భంగిమ) స్పర్శ, సంభాషణలు, వాసనలు, శబ్దాలు, ఊహలు, వస్త్రధారణ, బెడ్రూమ్ వాతావరణం. ఇలాంటివి ఎన్నో మంచి శృంగారానికి శృంగారంలో తృప్తికి దోహదం చేస్తాయి.
కామోద్రేకం, భావప్రాప్తి ఈ రెండూ శృంగారంలో ముఖ్య మైనవి. కామోద్రేకం కలిగించేవి, తగ్గించేవి, భావప్రాప్తి కల్గించేవి, కలగకుండా చేసే విషయాలపై సరిఅయిన అవగాహన భార్యాభర్తలిద్దరికీ ఉండాలి.
అనుమానం భర్తపైన భార్యకుగానీ భార్యపైన భర్తకు గానీ ఉండకూడదు. ఈ అనుమానం సెక్స్ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని దెబ్బ తీస్తుంది. అందువలన పరస్పరం నమ్మకం కావాలి. వివాహేతర సంబంధాలు భార్యాభర్తల అనుబంధాన్ని దెబ్బతీస్తాయి. అనేక సెక్స్ సమస్యలు కలుగుతూ ఉంటాయి. వాటిపట్ల అవగాహన కలిగిఉండి, సమస్యలు కలిగి నప్పుడు ఒకరికొకరు సహకరించుకుంటే సమస్యలు దూరపువుతాయి. ఆప్యాయత,అనురాగం ఉన్నదంపతులను సెక్స్ సమస్యలు ఎక్కువగా బాధించవు. సమస్య ఉన్నప్పుడు ఆప్యాయతానురాగాలు కరువైతే వైవాహిక జీవితంలో సమస్యలెక్కువవుతాయి. భావప్రాప్తి వైవాహిక జీవితానికే కాక వృత్తి విషయంలో కూడ అత్యంత ప్రధానమైనది. తృప్తి, భావప్రాప్తి ఉండేవాళ్ళు, పొందేవాళ్ళు వృత్తిలో కూడా రాణిస్తారు. ఆత్మవిశ్వాసంతో పనులు చేస్తారు. ఇతరులతో వ్యవహరించే తీరు కూడ బాగుంటుంది. పిల్లలపట్ల ప్రేమ, వాళ్ళ పెంపకంపై కూడ శృంగార జీవితం ప్రభావం అత్యధికంగా ఉంటుంది. ఇలాంటివి అనేక విషయాలపై అవగాహన కోసం ఎదురయ్యే అనేక సందేహాల నివృత్తి కోసం ఈ పుస్తకం ఉద్దేశించబడింది.
- ప్రచురణకర్తలు

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE