-
-
శ్రియం
Sriyam
Author: Viraja Datta
Publisher: Self Published on Kinige
Pages: 163Language: Telugu
ఈ శ్రియం (పుట్టుగం) అనే శీర్షిక శ్రీ గణపతి సత్ చిత్ ఆనంద స్వామిజీవారి మాతృ స్వరూపిణి, గురురూపిణి అయిన శ్రీమతి జయలక్ష్మిమాతగారి ముద్దు పేరుతో మొదలయినది. ఆవిడని వారి తండ్రి లింగన్నగారు ‘పుట్టు’ అని ముద్దుగా పిల్చుకొనే వారు, ఆవిడ బుజ్జి చేష్టలకి ముచ్చటపడి, తెలివి తేటలకి విస్మయపడి, పురాణ, వేద, హైందవ సంస్కృతి పట్ల ఆవిడకున్న జ్ఞాన సాగరానికి ఆశ్చర్యపడి, ముద్దుగా ప్రేమగా పుట్టు అనే వారు, కర్ణాటక రాష్ట్రంలో ఈ ముద్దు పేరు సర్వసాధారణంగా వినిపిస్తుంటుంది, ఆంధ్ర దేశంలో బంగారు, బుజ్జి అని పిల్చుకోనే విధంగా. ఇకపోతే ‘గం’ అనే బీజాక్షరము గణపతి బీజాక్షరము, ఆవిడకి గణపతి అంటే ప్రాణం కనుక పుట్టు ‘గం’ అని నామకరణం చేసి ఆవిడ పేరుతో కొన్ని విజ్ఞాన వికాస కార్యక్రమాలను శ్రీ గణపతి సత్ చిత్ ఆనంద ఆశ్రమాలలో నడిపిస్తున్నారు కూడాను. కాని ఇందు అనేక ఉపనిషత్ ఐశ్వర్య నిధులున్న కారణాన శ్రియం అనే నామమే పెట్టమన్నారు కాన రెండు నామాలు సరి అయినవిగా పేర్కొన్నాము.
ఆవిడ పైన ఆరాధనతో, ఆవిడ ఉపాసన, ఉపనిషత్, ఉపదేశ, ఉపవాస, ఉపనయన (ఈ ఉపనయనం-వినయం తో గురికి దగ్గర కావడమే ఉపనయనం అనే అర్థంలో) ఉపాద్యక్ష దక్షతకి జోహార్లు సమర్పించుకొంటూ, మన దైనందిన వ్యావహారిక కార్యక్రమాలలోను, నెమ్మ నెమ్మదిగా ఆధ్యాత్మిక మార్గంలోను విజయాలను చవి చూడ గలిగే సూక్ష్మమార్గాలను ఆవిడ చరిత్రలోను, మరియు మన స్వామిజి వారు అపుడపుడు ఇచ్చే ప్రసంగాలలోని వివేక చూడామణులను ప్రోవి చేసి కొని భద్రంగా దాచుకొన్న వాటిని ఈ గ్రంథం ద్వార సమర్పణ చేయడం జరుగుతున్నది.
"ఎక్కడయినా తప్పులున్న మన్నించండి, ఇది జయలక్ష్మి మాత కార్యము, అందరం ఆవిడ ఆశీర్వాదం పొందుదాము. జయగురుదత్త."
- విరజదత్త
