-
-
శ్రీరామదూతం శిరసానమామి
Sriramadutam Sirasa Namami
Author: V. Kameswara Rao
Publisher: V. Kameswara Rao
Pages: 257Language: Telugu
"హనుమంతుడు ఉన్నచోట భయం ఉండదు, ధైర్యం ఉంటుంది. నిర్వేదం ఉండదు, ఉత్సాహం ఉంటుంది. సంశయం ఉండదు, స్పష్టత ఉంటుంది. అలసత్వం ఉండదు, కార్యదీక్ష ఉంటుంది. తడబడడం ఉండదు, దాక్ష్యం (కార్యసాధనలో నేర్పు) ఉంటుంది. అపజయం ఉండదు, విజయం ఉంటుంది. అనితర సాధ్యమైన కార్యాలు సాధించినా ఆత్మస్తుతి ఉండదు, వినయమే ఉంటుంది. నేల విడిచి సాము చేసే ఆవేశం ఉండదు, ఆలోచనే ఉంటుంది."
"పాజిటివ్ థింకింగ్ని ఎలా అలవాటు చేసుకోవాలో హనుమంతుడి పాత్ర ద్వారా చూపించారు. క్లిష్టపరిస్థితుల్లో మెడిటేషన్ ద్వారా మనస్సుని నియంత్రించుకోవడం నేర్పారు. అటూ ఇటూ ఊగిసలాడుతూ, అందుబాటులో ఉన్న అవకాశాలని జారవిడుచుకునే వారికి మనస్సుని ఏకాగ్రం చేసుకుని అందివచ్చిన అవకాశాలని ఎలా సద్వినియోగం చేసుకోవాలో చూపించారు.
"నిత్యం దైన్యంతో ఉండేవాడి బుద్ధి వాడి వశంలో ఉండదు. మోయలేని బరువుతో నింపిన ఓడ నీటిలో మునిగిపోతున్నట్లు, అతడి వివేకం శోకంలో మునిగిపోతుంది."
"ఒక లక్ష్యం ఏర్పరుచుకుని ముందుకు పోతుంటే మనం ఊహించని ఎన్నో ప్రలోభాలూ (టెంప్టేషన్లు), మరెన్నో విఘ్నాలూ (హర్డిల్స్), ఒక్కోసారి ప్రమాదాలూ (పిట్ఫాల్స్) ఎదురౌతాయి. వాటన్నిటినీ జాగ్రత్తగా అధిగమించాలి."
"హనుమా! కార్యసాధకుడికి నాలుగు లక్షణాలు ఉండాలి. అవి ధృతి (ధైర్యం, ఆత్మవిశ్వాసం), దృష్టి (మంచి ఆలోచనా శక్తి), మతి (తెలివి, సమయస్ఫూర్తి), దాక్ష్యం (పనిచేయడంలో నేర్పు), ఈ నాలుగు లక్షణాలు నువ్వు చక్కగా చూపించావు. ఇవి నీలో ఉన్నట్లుగా ఎవరిలో ఉంటాయో అతడు కూడా నీలాగే తలపెట్టిన ప్రతి పనినీ సాధించి తీర్తాడు."
ఇవన్నీ ఈ పుస్తకంలో ఉన్న వాక్యాలు.
ఇందులో అడుగడుగునా ఉన్న ఆణిముత్యాలలాంటి వాక్యాలకి ఉదాహరణలు.
వ్యక్తిత్వ వికాసానికి రామాయణంలో హనుమంతుడి పాత్ర అధ్యయనం చెయ్యడం కంటే మేలైన ఉపాయమేముంది!
A must read. I liked the in depth analysis of hanuma's charactor in this book.